
పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించొద్దు
ఎల్లారెడ్డి: ఆటోడ్రైవర్లు తమ ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని ఎస్సై మహేశ్ అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డిలో ఆటోడ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆటోడ్రైవర్లు వారి వెంట ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్సు ఉంచుకోవాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలను నడపవద్దని అన్నారు.
బాన్సువాడ: బాన్సువాడ ఎస్‌హెచ్‌వోగా తుల శ్రీధర్ బదిలీపై వచ్చారు. బాన్సువాడలో ఇది వరకు సీఐగా పని చేసిన మండల అశోక్‌ను ఐజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. మల్టీజోన్‌లో భాగంగా పీసీఆర్ కామారెడ్డిలో పని చేసిన తుల శ్రీధర్‌ను బాన్సువాడకు బదిలీ చేశారు. బాన్సువాడకు బదీలైన శ్రీధర్ నేడు బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిసింది.
ఎల్లారెడ్డిరూరల్: వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ఎస్సై మహేశ్ సూచించారు. ఆదివారం ఎల్లారెడ్డిలో వాహనాల తనిఖీ చేపట్టారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. బైక్ నడిపే వారు హెల్మెట్, కారు నడిపేవారు సీట్‌బెల్ట్ ధరించాలని సూచించారు. తనిఖీలో పోలీసు సిబ్బంది ఉన్నారు.
భిక్కనూరు: తనతో పాటు పిల్లలపై దాడిచేసి పారిపోయిన భర్తపై చర్యలు తీసుకోవాలని పిట్ల ప్రియాంక అనే మహిళ భిక్కనూరు పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కాచాపూర్ గ్రామానికి చెందిన ప్రియాంక వివాహం దోమకొండ మండలం గోపాలపల్లి గ్రామానికి చెందిన పిట్ల భాస్కర్‌తో ఆరేళ్ల క్రితం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రియాంక ఇటీవల తన పుట్టినిల్లు అయిన కాచాపూర్‌కు రాగా భర్త భాస్కర్ గ్రామానికి వచ్చి ప్రియాంకతో పాటు పిల్లలపై దాడి చేసి పరారయ్యాడు. తమపై దాడి చేసి పరారైన భర్త భాస్కర్‌పై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
మద్నూర్(జుక్కల్): ఎమ్మెల్సీ కవిత ఆదేశాలతో జుక్కల్ నియోజకవర్గంలో జాగృతి కార్యక్రమాలు చేపడతామని జాగృతి నియోజకవర్గ ఇన్‌చార్జి రాజశేఖర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. త్వరలో జాగృతి ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో కార్యాచరణ ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నామని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో జాగృతి కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ ఎత్తున కవిత సభ ఉంటుందని తెలిపారు. నాయకులు సురేష్‌గౌడ్, బాలరాజు ఉన్నారు.

పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించొద్దు

పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించొద్దు