
ప్రమాదకరంగా బ్రిడ్జి రోడ్డు
రామారెడ్డి: రామారెడ్డి నుంచి కామారెడ్డికి వెళ్లే మార్గంలోని గంగమ్మ వాగు బ్రిడ్జి వద్ద ఏర్పడిన పెద్ద గుంతతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ప్రయాణికులు, వాహనదారులు భయపడుతున్నారు. ఈ ప్రాంతంలో నిత్యం ఆర్టీసీ బస్సులు, ఆటోలు, బైక్‌లు ప్రయాణం సాగిస్తున్నా ఆర్‌అండ్‌బీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చీకట్లో కొత్తగా వచ్చే వారు ప్రమాదానికి గురికావడం తప్పదు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం త్వరగా చేపట్టి రోడ్డును బాగు చేయాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.