
అ‘పూర్వ’ సమ్మేళనం
మోపాల్/ ఖలీల్‌వాడి/ మోర్తాడ్/ బాల్కొండ/ ఆర్మూర్‌టౌన్/ సదాశివనగర్: నగరశివారులోని బోర్గాం(పి) జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1998–99వ సంవత్సవంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. చాలా ఏళ్ల తర్వాత విద్యార్థులంతా ఒకే వేదికపై కలవడంతో ఆత్మీయంగా పలకరించుకున్నారు. నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శ్రీనివాస్, రాజు, నరేందర్, శ్రీహరి, లత, ఉమా మహేశ్వరి, దొంతుల రవి, కవిత, కల్పన, సుకన్య తదితరులు పాల్గొన్నారు. నగరంలోని పద్మనగర్‌లో ఉన్న శ్రీ విశ్వశాంతి హైస్కూల్‌లో 2007–2008లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు హరిదాస్, అరుణ, అనిల్, రాజేశ్, రాజేందర్, సుజాత, థామస్, ప్రసన్న, పాండు, గణేశ్, మురళి పాల్గొన్నారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ ఉన్నత పాఠశాలలో 1999–2000లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు, ముప్కాల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2003–04లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సన్మానించారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో 2005–06 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కార్యక్రమంలో పూర్వవిద్యార్థులు జయలక్ష్మి, లావణ్య, స్వాతి, శిల్ప, శ్రావణి, లక్ష్మి, ప్రియాంక, సునీత, భాను తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని పద్మాజివాడి ఉన్నత పాఠశాలలో 2008–09 పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం రమణ, ఉపాధ్యాయులు వీవీ రమణ, అబ్బయ్య, వాణి, లింగం, మీనా, సబిత, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

అ‘పూర్వ’ సమ్మేళనం