
సమాచార హక్కు వ్యవస్థను బలోపేతం చేయాలి
తెయూ(డిచ్‌పల్లి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమా చార హక్కు వ్యవస్థను బలోపేతం చేయాలనే సంకల్పంతో స.హ. చట్టం–2005ను ప్రవేశపెట్టాయని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి అన్నారు. తెయూ సమాచార హక్కు సహాయాధికారి డాక్టర్ నీలిమా అధ్యక్షతన ‘సమాచార హక్కు చట్టం–2005’ పై శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు రిజిస్ట్రార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజల సహకారం, భాగస్వామ్యంతోనే వ్యవస్థలు ప్రగతి పూర్వకంగా ముందుకు పోతాయన్నారు. పౌర సమాజానికి ఉపయోగపడే సమాచారాన్ని పారదర్శకంగా అందించాలన్నారు. దేశ సమగ్రతకు భంగం కలిగించే సమాచారాన్ని గోప్యంగా ఉంచాలన్నారు. వర్సిటీ న్యాయ కళాశాల ప్రిన్సిపల్ కే ప్రసన్న రాణి మాట్లాడుతూ సమాచారం అడగడం పౌరుల ప్రధానహక్కుగా ప్ర భుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ మామిడాల, కంట్రోలర్ ప్రొఫెసర్ సంపత్ కుమార్, యూజీసీ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ సీహెచ్ ఆంజనేయులు, సమాచార కేంద్రం జూనియర్ అసిస్టెంట్ హరీశ్, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.