
చికిత్స పొందుతూ యువకుడి మృతి
ఎల్లారెడ్డి: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న యువకుడు పోతుల ప్రకాశ్ గురువారం రాత్రి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మెదక్ జిల్లా ఏడుపాయల నుంచి ఎల్లారెడ్డికి బైక్‌పై వస్తున్న ప్రకాశ్ ప్రమాదవశాత్తు డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం మెదక్‌కు తరలించగా గురువారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని సంతాయిపేట్ గ్రామానికి చెందిన ఏడుగురిపై అ ట్రాసిటీ కేసు నమోదైనట్లు ఎస్సై మురళి తెలిపారు.గత నెల 30న సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా వృత్తిరీత్యా మాదిగ వారు డప్పులు కొట్టినందుకు రూ.20 నుంచి రూ.50 వరకు ఇస్తారు. గ్రామస్తులందరూ డబ్బులు ఇవ్వగా, గ్రామానికి చెందిన వడ్ల నరేందర్ అనే వ్యక్తి డబ్బులను ఇవ్వలేదు.కాగా ఈ నెల 5న ఒకరి అంత్యక్రియల్లో కని పించిన నరేందర్‌ను మద్దికుంట పాపయ్య డబ్బులు అడిగాడు. పది మందిలో తననే డ బ్బులు అడుగుతావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నరేందర్‌తోపాటు మరో ఆరుగు రు పాపయ్యను అసభ్యపదజాలంతో దూషిస్తూ కొట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు వడ్ల నరేందర్,వడ్ల రాజు,కుమ్మరి కిష్టయ్య, కుమ్మరి నర్సింహులు, కుమ్మరి సంజీవులు, ముంజ నర్సయ్య, సుతారి వెంకటేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.