
ఉత్సవాలకు ముస్తాబైన చాముండేశ్వరి ఆలయం
భక్తుల కోరికలు తీర్చే అమ్మవారు
● అమ్మవారిని ప్రతిష్ఠించి
నేటికి 54 ఏళ్లు పూర్తి
● అధిక సంఖ్యలో తరలిరానున్న భక్తులు
దోమకొండ: మండల కేంద్రంలోని చాముండేశ్వరి ఆలయం నేటి నుంచి నిర్వహించే ఉత్సవాలకు ముస్తాబైంది. రాష్ట్రంలో సికింద్రాబాద్ తర్వాత అతిపెద్ద మహంకాళి ఆలయంగా పేరుగాంచిన ఈ ఆలయ నిర్మాణం చేపట్టి నేటితో 54 ఏళ్లు పూర్తవుతోంది. ఈ ఆలయాన్ని మహంకాళి, చాముండేశ్వరి ఆలయంగా పిలుస్తుంటారు. కాళిక, దుర్గా, చాముండి మాతగా భక్తులకు దర్శనమిచ్చే చాముండేశ్వరి అమ్మవారు కార్యాలను విజయవంతం చేస్తుందని ప్రతీతి. కాగా పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు కఠోర తపస్సుతో పురుషుల చేతిలో మరణించకూడదని పరమేశ్వరుని నుంచి వరం పొందాడు. ఆ వరం పాందిన గర్వంతో సకల లోకాలను పీడించాడు. భయబ్రాంతులైన సకల లోక వాసులు త్రిముర్తులను వేడుకోగా, మహిషాసురుడిని మదించేందుకు ఒక సీ్త్ర శక్తిని సృష్తిస్తారు. ఆ శక్తి స్వరూపిణియే చాముండేశ్వరి మాతగా చరిత్రలో నిలిచిపోయింది.
ఆలయ చారిత్రక నేపథ్యం..
దోమకొండ సంస్థానానికి చెందిన కామినేని వంశీయులు ఈ ఆలయాన్ని నిర్మించారు. 1943–1946 మధ్య కాలంలో ఆలయాన్ని నిర్మించినట్లు గ్రామ పెద్దలు తెలిపారు. ఆలయంలోని అమ్మవారి ప్రతిమ రాక్షసులను సంహరించే రూపంలో ఉండి భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారికి ఉన్న 18 చేతుల్లో ప్రతి చేతిలో ఒక ఆయుధం కలిగి ఉండటం విశేషం.
ఆలయంలో నేటి కార్యక్రమాలు
ఆలయంలో ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. భక్తులు అమ్మవారికి అభిషేకాలు చేపట్టి ఒడిబియ్యం పోయనున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహిస్తారు. సాయంత్రం అమ్మవారి విగ్రహాల ఊరేగింపు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టేందుకు ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
ఆలయంలోని అమ్మవారి విగ్రహం
దోమకొండలోని చాముండేశ్వరి ఆలయం
భక్తులు కోరిన కోరికలు తీర్చే అమ్మవారుగా చా ముండేశ్వరి అమ్మవారు పేరుగాంచింది. యాభై మూడేళ్లుగా అమ్మవారి కి బోనాలు, శరన్నవరాత్రి ఉత్సవాలు, వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మెదక్, నిజామాబాద్, సిరిసిల్లా, సిద్దిపేట, హైదరాబాద్ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు.
– భావి శరత్‌చంద్రశర్మ,
ఆలయ అర్చకులు, దోమకొండ

ఉత్సవాలకు ముస్తాబైన చాముండేశ్వరి ఆలయం

ఉత్సవాలకు ముస్తాబైన చాముండేశ్వరి ఆలయం