
ఆకుల లలితకు ‘జెడ్పీ’ అవకాశం ఇవ్వాలి
మాక్లూర్: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవిప్రకాష్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, ఆకుల లలిత హైదరాబాద్‌కు తరలివెళ్లి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని కలిశారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఆకుల లలితకు అవకాశం కల్పించాలని కోరారు. మండలంలోని మానిక్‌భండార్‌కు చెందిన ఆకుల లలితను మాక్లూర్ జెడ్పీటీసీగా గెలిపించుకుంటామన్నారు. దీనిపై పీసీసీ అధ్యక్షుడు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఇదే విషయమై బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని కూడా కలిసి, చర్చించినట్టు ఆ పార్టీ సీనియర్ నాయకులు ‘సాక్షి’తో చెప్పారు. నాయకులు ఎనుగంటి గంగాధర్‌గౌడ్, వెంకటేశ్వరరావు, జంగిడి సతీష్, అమరేందర్‌రావు, రాజేందర్, రాజేశ్వర్, లచ్చారెడ్డి, దయాకర్‌రావు నాయకులు తదితరులు పాల్గొన్నారు.