
ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలు
లింగంపేట(ఎల్లారెడ్డి): శెట్పల్లి గ్రామంలో గురువారం ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాడ్వాయి ఖండ శారీరక్ ప్రముఖ్ రాజారాం రంజిత్ మాట్లాడారు. గ్రామాల్లో ప్రతీ యువకుడు ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరాలని పిలుపునిచ్చారు. హిందుత్వ జీవన విధానం, విశ్వశాంతికి ఆధారమని, ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయపరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు. దేశ అభివృద్ధి, హిందువుల పంచ పరివర్తన కోసం పాటుపడాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఇంటింటికి జన జాగరణ చేపడతామని చెప్పారు.
ఎండ్రియాల్‌లో ..
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఎండ్రియాల్‌లో ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు దేశభక్తి కలిగి ఉండాలన్నారు. ప్రతి గ్రామంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.
హిందు సంఘటన కోసమే ఆర్‌ఎస్‌ఎస్
నిజాంసాగర్(జుక్కల్): వ్యక్తి నిర్మాణం హిందూ సంఘటన కోసమే ఆర్‌ఎస్‌ఎస్ 100 సంవత్సరాలుగా ప్రయత్నిస్తుందని జిల్లా బౌద్ధిక్ ప్రముఖ్ వక్త వేదమిత్ర అన్నారు. శుక్రవారం మహమ్మద్ నగర్ మండలంలోని బూర్గుల్, నర్వ గ్రామాల్లో ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వక్త మాట్లాడుతూ.. పౌర విధులు, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ భావన, సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్ ఇలా సమాజంలో ఐదు పరివర్తనలు రావాలన్నారు. పిట్లం ఖండ సహ శరీరక ప్రముఖ్ పెంటబోయిన మోహన్, శాఖ కార్యవాహలు హోడిగె రవికిరణ్, సంతోష్, సీహెచ్. ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలు

ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాలు