
కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ నాయకులు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మాసాన్‌పల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్, లింగంపల్లికలాన్ మాజీ సర్పంచ్ తనయుడు నీరుడి రాజు శుక్రవారం బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. వీరితోపాటు గోపాల్‌పేటకు చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు బాబూరావు సైతం కాంగ్రెస్‌లో చేరారు. ఈ మేరకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ వారికి కాంగ్రెస్ కండువాలను కప్పి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని, పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీధర్‌గౌడ్, తాండూర్ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, నాయకులు విక్రాంత్‌రెడ్డి, బాల్‌రెడ్డి, బండ బాబు, బన్సి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ నేత
భిక్కనూరు: రామేశ్వర్‌పల్లికి చెందిన కాంగ్రెస్ నేత కేతి మధు శుక్రవారం బీఆర్‌ఎస్‌లో తన అనుచరులతో కలి సి చేరారు. బీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి అత్తెల్లి శ్రీనివాస్ పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా కేతి మధు మాట్లాడుతూ.. రుణమాఫీ చేయడం, యూరియా సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అందుకే పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నానన్నారు. విండో చైర్మన్ నాగార్తి భూంరెడ్డి, నేతలు అందె మహేందర్‌రెడ్డి, ద్యావర సాయిరెడ్డి, అనంత్ గౌడ్, తక్కళ్ల రవీందర్ రెడ్డి, పోతిరెడ్డి, జిల్లెల రవీందర్‌రెడ్డి, నర్సారెడ్డి పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ నాయకులు