
అలయ్ బలయ్‌లో చుక్కాపూర్ కళాకారుల ధూంధాం
మాచారెడ్డి: హైదరాబాద్‌లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో చుక్కాపూర్ గ్రామానికి చెందిన బేడ బుడగ జంగాల కళాకారులు ఆటపాటలతో ధూంధాం చేశారు. ఈ సందర్భంగా బేడ బుడగ జంగాల ప్రతినిధి లక్ష్మీపతి మాట్లాడుతూ.. తమ వంశీకులు చాపలు అల్లుతూ, బుర్రకథలు చెబుతూ జీవనం సాగిస్తున్నారని, ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్లు కూఆ ఇవ్వడం లేదన్నారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ, బండారు దత్తాత్రేయ, కల్వంకుంట్ల కవిత, తదితరులను కలిసి తమ గోడును వినిపించినట్టు ఆయన తెలిపారు. నేతలు శంకర్, రవి, తదితరులున్నారు.