
జెడ్పీ పీఠం జనరల్
‘స్థానిక’ రిజర్వేషన్లు ఖరారు
● బలహీన వర్గాలకు 42 శాతం సీట్లు...
● మహిళలకు అన్నింటా సగం స్థానాలు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా పరిషత్ పీఠం జనరల్ స్థానంగా ఖరారైంది. రాష్ట్రంలోని జిల్లా పరిషత్‌కు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ గెజిట్ విడుదల చేయగా.. కామారెడ్డి స్థానం అన్ రిజర్డ్వ్‌గా డిక్లేర్ చేశారు. అలాగే జిల్లాలోని ఆయా మండలాల జెడ్పీటీసీ స్థానాలు, ఎంపీపీ పదవులతోపాటు ఎంపీటీసీ స్థానాలు, సర్పంచ్, వార్డు స్థానాలకూ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. బీసీలకు 42 శాతం చొప్పున ఆయా స్థానాల రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన నిర్ణయించారు. అలాగే అన్నింటా సగం స్థానాలు మహిళలకు కేటాయించారు. జిల్లాలోని 25 మండలాల్లో ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులతోపాటు 233 ఎంపీటీసీ స్థానాలు, 532 సర్పంచ్, 4,656 వార్డు స్థానాలకు జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సమక్షంలో రాజకీయ పార్టీల సమక్షంలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. అలాగే సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు ఆయా రెవెన్యూ డివిజన్‌లలో ఆర్డీవోల ఆధ్వర్యంలో ఖరారు చేశారు. పంచాయతీ వార్డు సభ్యులకు సంబంధించి మండలాల్లో ఎంపీడీవోల ఆధ్వర్యంలో ఖరారు చేశారు. స్థానిక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. రిజర్వేషన్లు అనుకూలంగా ఉన్న నేతలు పోటీకి సై అంటుంటే, అనుకూలంగా రాని వాళ్లంతా నిరాశకు గురయ్యారు. మహిళలకు సగం స్థానాలు కేటాయించడంతో కొన్ని చోట్ల నాయకులు తమ కుటుంబ సభ్యులను రంగంలోకి దింపేందుకు ఆలోచనలు మొదలుపెట్టారు. జిల్లాలో 25 మండలాలు ఉండగా, 25 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో నాలుగు స్థానాలు జనరల్‌కు, నాలుగు స్థానాలు జనరల్ మహిళకు కేటాయించారు. 11 స్థానాలు బీసీలకు కేటాయించగా ఆరు బీసీ జనరల్, ఐదు బీసీ మహిళలకు దక్కనున్నాయి. ఎస్సీలకు నాలుగు కేటాయించగా రెండు ఎస్సీలు, రెండు ఎస్సీ మహిళలకు, ఎస్టీలకు రెండు కేటాయించగా ఒకటి ఎస్టీలకు, ఒకటి ఎస్టీ మహిళకు కేటాయిస్తారు. జిల్లాలో 233 ఎంపీటీసీ స్థానాలు, 532 సర్పంచ్ పదవులు, 4,656 వార్డు సభ్యుల పదవులకు కూడా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. అయితే రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలోకి వెళ్లడంతో అధికారికంగా ప్రకటించడం లేదని తెలుస్తోంది.
మండలం జెడ్పీటీసీ ఎంపీపీ
బాన్సువాడ బీసీ బీసీ
భిక్కనూరు బీసీ బీసీ
బీబీపేట బీసీ మహిళ బీసీ మహిళ
బిచ్కుంద జనరల్ జనరల్ మహిళ
బీర్కూర్ జనరల్ జనరల్ మహిళ
దోమకొండ జనరల్ మహిళ జనరల్
డోంగ్లీ ఎస్సీ మహిళ ఎస్సీ మహిళ
గాంధారి బీసీ మహిళ బీసీ
జుక్కల్ ఎస్సీ ఎస్సీ
కామారెడ్డి ఎస్సీ ఎస్సీ మహిళ
లింగంపేట బీసీ బీసీ
మాచారెడ్డి ఎస్టీ మహిళ ఎస్టీ మహిళ
మద్నూర్ బీసీ బీసీ
మహమ్మద్‌నగర్ బీసీ మహిళ బీసీ మహిళ
నాగిరెడ్డిపేట ఎస్సీ మహిళ ఎస్సీ
నస్రుల్లాబాద్ జనరల్ జనరల్ మహిళ
నిజాంసాగర్ బీసీ మహిళ బీసీ
పల్వంచ బీసీ బీసీ మహిళ
పెద్దకొడప్‌గల్ బీసీ బీసీ మహిళ
పిట్లం జనరల్ మహిళ జనరల్
రాజంపేట ఎస్టీ ఎస్టీ
రామారెడ్డి బీసీ మహిళ బీసీ మహిళ
సదాశివనగర్ జనరల్ మహిళ జనరల్
తాడ్వాయి జనరల్ జనరల్ మహిళ
ఎల్లారెడ్డి జనరల్ మహిళ జనరల్
జెడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్లు ఇలా..

జెడ్పీ పీఠం జనరల్