
ఎనిమిదేళ్లకే ఏమిటీ పరిస్థితి..?
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపల్ భవనం నిర్మించి ఎనిమిదేళ్లే అయినప్పటికీ అక్కడి పరిస్థితి మాత్రం పురాతన భవనాన్ని తలపిస్తోంది. గోడలకు నీటి చెమ్మ, పగుళ్లు వస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే అన్ని విభాగాల్లో ఊరుస్తోంది. గ్రౌండ్‌ఫ్లోర్‌లో నేల కుంగుతోంది. అక్కడక్కడ పెచ్చులూడుతున్నాయి. అదే జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం. 2013లో ప్రభుత్వ నిధులు రూ.కోటితో మున్సిపల్ భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే నిధులు సరిపోకపోవడంతో 2015లో మరో రూ.కోటి 20 లక్షలను ప్రభుత్వం మంజూరు చేయడంతో రెండస్థుల భవన నిర్మాణ పనులను పూర్తి చేశారు. 2017 సెప్టెంబర్ 20న అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో భవనాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం భవనంలోని ఆయా వి భాగాల గదుల్లో టైల్స్ ధ్వంసమయ్యాయి. చిన్న పాటి వర్షం కురిసినా మొదటి, రెండో అంతస్తులోని ఆయా గదుల్లో ఊరుస్తోంది. దీంతో నీరు పడకుండా బకెట్‌లు, చెత్తబుట్లను సిబ్బంది ఏర్పాటు చేస్తున్నారు. గోడలకు నీటి చెమ్మ వస్తుండడంతో టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, అకౌంటెంట్ విభాగాల్లోని విలువైన రికార్డులు కౌన్సిల్ హాల్‌లోకి తరలించారు. కౌన్సిల్ హాల్‌లో పోడియం వెనకాల ఏసీ చెడిపోయింది. నీటి చెమ్మ కాణంగా విద్యుత్ వైర్లు కాలిపో తున్నాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు చెడిపోతున్నా యి. గోడలకు రంగులు ఊడిపోతు కార్యాలయం క ళావిహీనమైంది. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డిని వివరణ కోరగా.. కార్యాలయా నికి మరమ్మతులు చేపడుతామని అన్నారు.
వర్షం కురిస్తే ఊరుస్తున్న
మున్సిపల్ భవనం
ఎక్కడ చూసినా పగుళ్లు..
బలహీనమవుతున్న గోడలు
కుంగుతున్న ఫ్లోర్
కామారెడ్డి బల్దియా భవన దుస్థితి ఇది..

ఎనిమిదేళ్లకే ఏమిటీ పరిస్థితి..?

ఎనిమిదేళ్లకే ఏమిటీ పరిస్థితి..?