
మాన్యువల్ విద్యుత్ బిల్లింగ్‌కు స్వస్తి
తప్పులకు ఆస్కారం ఉండదు
● జిల్లాలో ‘ఏఎంఆర్’ విధానం మీటర్ల బిగింపు
● ప్రయోగాత్మకంగా హై వోల్టేజీ విద్యుత్ వినియోగదారులకు ఏర్పాటు
కామారెడ్డి టౌన్: మానవ రహిత ఆటోమేటిక్ మీటర్ రీడింగ్(ఏఎంఆర్) దిశగా టీజీఎన్పీడీసీఎల్ అడుగులు వేస్తోంది. బిల్లుల అందజేతలో వేగం రూపంలో పారదర్శకతను పెంచేందుకు, విద్యుత్ వినియోగదారులకు బిల్లింగ్ సమస్యలు లేకుండా చూసేందుకు ఏఎంఆర్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో తొలుత పారిశ్రామిక రంగంలో అధిక హై వోల్టేజీ(హెచ్‌టీ) వినియోగించే పరిశ్రమల్లో వీటిని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తున్నారు. అనంతరం ఇతర సర్వీసులకు సైతం విస్తరించాలని సంస్థ యోచిస్తుందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు.
కామారెడ్డిలో 366 సర్వీసులు..
కామారెడ్డి జిల్లాలో హై వోల్టేజీ వినియోగించే పరిశ్రమలకు సంబంధించి 366 విద్యుత్ సర్వీసులున్నాయి. వాటికి 100 శాతం ఏఎంఆర్ ఏర్పాటు లక్ష్యంలో భాగంగా ఇప్పటి వరకు 75 శాతం పూర్తి చేశారు. పరిశ్రమల్లో మీటరు రీడింగ్‌కు హై వోల్టేజీ (హెచ్‌టీ) విద్యుత్తు వాడుకునే కేటగిరీలో 55 హెచ్‌పీకి మించి సామర్థ్యం ఉంటే ఏడీఈ స్థాయి అధికారి, 55 హెచ్‌పీ లోపు ఉంటే ఏఈ స్థాయి అధికారి పర్యవేక్షణ చేస్తారు. నాన్ స్లాబ్ రీడింగ్‌ను లైన్ ఇన్‌స్పెక్టర్లు, స్లాబ్ రీడింగ్‌ను ప్రైవేట్, జూనియర్ లైన్‌మన్లు చూస్తారు. మీటరు రీడింగ్ నమోదులో రోజులు ఆలస్యమైతే స్లాబ్ రేటు మారిపోతుంది. ఈ కారణంగా కరెంటు బిల్లు ఎక్కువగా వస్తోందన్న ఫిర్యాదులు తరచూ వస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఏఎంఆర్ పరిష్కారం చూపుతుంది. ఏఎంఆర్ వల్ల తప్పులు జరిగే ప్రసక్తి ఉండదని, విద్యుత్తు సరఫరాలో వచ్చే హెచ్చు తగ్గులు త్వరితగతిన గుర్తించవచ్చని, సిబ్బంది సమయం వృథా కాదని అధికారులు తెలిపారు. ఈ ఏఎంఆర్‌లో 4జీ కమ్యూనికేషన్ సిమ్‌ను అమర్చుతారు. దీంతో నమోదైన డేటా ఎలాంటి మానవ ప్రమేయం లేకుండా వరంగల్‌లోని సెంట్రల్ సర్వర్‌కు చేరుతుంది. సిబ్బంది ఖర్చు లేకుండా 30 రోజుల్లో కచ్చితమైన బిల్లింగ్ పూర్తవుతుంది.
జిల్లాలో ఉన్న హెచ్‌టీ మీటర్లకు ఏఎంఆర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. దీంతో మానవ రహితంగా బిల్లింగ్ వస్తుంది. తప్పులు జరిగే ఆస్కారం ఉండదు. సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలోని హెచ్‌టీ, పరిశ్రమలకు అన్నింటికి అమర్చుతున్నాం. ఏడీఈ స్థాయి నుంచి లైన్‌మెన్ వరకు వీటిని పర్యవేక్షిస్తాం.
– శ్రవణ్ కుమార్, ఎస్‌ఈ, కామారెడ్డి

మాన్యువల్ విద్యుత్ బిల్లింగ్‌కు స్వస్తి

మాన్యువల్ విద్యుత్ బిల్లింగ్‌కు స్వస్తి