
కంటైనర్‌ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
● 9 మందికి గాయాలు
డిచ్‌పల్లి: డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి గ్రామం వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. డిచ్‌పల్లి ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు 27 మంది ప్రయాణికులతో ప్రైవేట్ టావెల్స్ బస్సు బయల్దేరింది. మధ్యప్రదేశ్ నుంచి తమిళనాడుకు వెళుతున్న కంటైనర్‌ను డ్రైవర్ సుద్దపల్లి వద్ద రహదారిపై నిలిపి పక్కనే ఉన్న దుకాణానికి సరుకుల కోసం వెళ్లాడు. అదే సమయంలో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్‌ను వెనుక నుంచి ఢీకొట్టి అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. దీంతో బస్సులో ఎడమవైపు కూర్చున్న ప్రయాణికులు తొమ్మిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఫారుఖ్, రవీందర్, లింగమ్మ, అల్తాఫ్ ఉన్నారు. కంటైనర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.