
జిల్లా ఉపాధ్యాయుడికి అవార్డు
కామారెడ్డి రూరల్: చిన్నమల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల గణితశాస్త్ర ఉపాధ్యాయుడు విజయగిరి రామకృష్ణకు శారద ఎడ్యుకేషనల్ సొసైటీ నేషనల్ టీచర్స్ ఎక్సలెన్స్ అవార్డు అందించింది. గురువారం హైదరాబాద్‌లోని బిర్లా ప్లానిటోరియంలో గల భాస్కర ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఏటా దేశవ్యాప్తంగా అత్యుత్తమ బోధనలు, సృజనాత్మక ఆవిష్కరణలు, విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేసిన ఉపాధ్యాయులను గుర్తించి ఈ అవార్డు అందిస్తామని శారద ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ పట్నం కమలాకర్ తెలిపారు.
అనారోగ్యంతో ఒకరి ఆత్మహత్య
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని అడ్లూ ర్ ఎల్లారెడ్డి గ్రామంలో ఒకరు జీవితంపై విరక్తితో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎ స్సై పుష్పరాజ్ తెలిపారు. గ్రామానికి చెందిన కుమ్మరి రాజయ్య (55) పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఆస్పత్రిలో చూయించినా రోగం నయం కావడం లేదు. దీంతో జీవితంపై విరక్తి తో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.