
పట్టుబట్టి.. విజయం సాధించి..
కామారెడ్డి టౌన్: మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లికి చెందిన కొండపల్లి గాయత్రి బీసీ సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తోంది. ఓ వైపు జాబ్ చేస్తూనే గ్రూప్–1కు పట్టుదలతో సన్నద్ధమైంది. ఆమె పట్టుదలకు విజయం వరించింది. గ్రూప్–1కు ఎంపికై ంది. మల్జీజోన్–1లో 201వ ర్యాంకు, మహిళా విభాగంలో 4వ ర్యాంకు సాధించింది. రెండు రోజుల క్రితం టీజీపీఎస్‌సీ గ్రూప్–1 తుది ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగానికి ఎంపికై న గాయత్రి మాటల్లోనే...
మా నాన్న సీతారాములు ఆర్టీసీ కండక్టర్, అమ్మ రాజమణి వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్‌ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. 7వ తరగతి వరకు రామారెడ్డిలో, 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీలో బీఎస్సీ, బీజెడ్‌సీ జిల్లా కేంద్రంలో చదివాను. ఉస్మానియాలో ఎమ్మెస్సీ, ఎంఎల్‌ఐఎస్‌సీ పూర్తి చేశాను. 2020లో గ్రూప్–4కి ఎంపికై కామారెడ్డి బీసీ సంక్షేమ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరాను. డబుల్ పీజీ చదివి జూనియర్ అసిస్టెంట్‌గా ఎందుకమ్మా గ్రూప్–1 ప్రయత్నించి అధికారి కావొచ్చని తోటి ఉద్యోగులు చెప్పడంతో నేను అప్పటి నుంచి తీవ్రంగా ప్రయత్నించాను. గ్రూప్–1 ఉద్యోగం రాదని చాలా మంది ఎగతాళి చేయడంతో నాలో ఇంకా పట్టుదల పెరిగింది. ఎలాంటి శిక్షణ లేకుండానే సొంతంగా ప్రిపేర్ అయ్యాను. ఇటీవల గ్రూప్–1 ఫలితాల్లో నెగ్గాను. ఎకై ్సజ్ శాఖలో అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. విధి నిర్వహణలో కూడా విజయాలు సాధిస్తాను. నిజాయితీగా నిబద్ధతగా విధులు నిర్వహిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటాను. మా అమ్మ కూడా నన్ను చాలా ప్రోత్సహించింది. ఇంట్లో టీవీ కనెక్షన్ కూడా తొలగించాం. సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చేయకుండా చాలా కష్టపడ్డాను. నా కష్టానికి ఫలితం దక్కింది.
బీసీ సంక్షేమ శాఖలో జూనియర్
అసిస్టెంట్‌గా పని చేస్తూనే
గ్రూప్–1కు ఎంపికై న గాయత్రి
మల్టీజోన్–1లో 201 ర్యాంకు,
మహిళా విభాగంలో 4వ ర్యాంకు
ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా ఉద్యోగం