
కాత్యాయని దేవి అవతారంలో అమ్మవారు
నేడు వెయ్యి మందితో సామూహిక నవదుర్గ వ్రతం
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి హౌసింగ్‌బోర్డు కా లనీలోని శారదామాత ఆలయంలో దేవి నవరా త్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు లలితా పంచమి సందర్భంగా వెయ్యి మంది మహిళలతో సామూహిక నవదుర్గ మహా వ్రతం నిర్వహించనున్నట్లు వేద పండితులు జి.అంజనేయశర్మ తెలిపారు. మహిళా భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
సాక్షి నెట్‌వర్క్:దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. నాలుగో రోజు అమ్మవారు కాత్యాయని దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. మండపాల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం ప్రసాదాలు పంపిణీ చేశారు. పలు చోట్ల ప్రత్యేక భజన కార్యక్రమాలు, అన్నదానాలు నిర్వహించారు.