
మహిళలకు అతిపెద్ద పండుగ బతుకమ్మ
కామారెడ్డి క్రైం: బతుకమ్మ పండుగ మహిళా సోదరీమణులకు అతిపెద్ద పండుగ అని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ, ఎకై ్సజ్ శాఖల ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్, ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు ఎస్పీ చైతన్యారెడ్డి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బతుకమ్మ ఆడడానికి మహిళలు ఎంతో ఉత్సాహాన్ని చూపి ఎంతో సంతోషంగా, ఆనందంగా జరుపుకుంటారన్నారు. జిల్లాలో బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించాలనే ప్రభుత్వ సూచనల మేరకు ప్రతిరోజు కలెక్టరేట్లో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించడంతోపాటు జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో బతుకమ్మ పండుగను నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు, టీఎన్జీవో ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, కలెక్టరేట్ సిబ్బంది తదితరులున్నారు.