
కమ్యూనిటీ భవన నిర్మాణానికి కృషి
● ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు
పోచారం శ్రీనివాస్‌రెడ్డి
బాన్సువాడ: ఆర్టీసీ విశ్రాంత కార్మికుల కమ్యూనిటీ భవనం నిర్మాణానికి కృషి చేస్తానని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక రెడ్డి సంఘంలో ఆర్టీసీ విశ్రాంత కార్మికుల సంఘంలో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. విశ్రాంత ఆర్టీసీ కార్మికుల సంఘం భవనం కోసం 250 గజాల స్థలంతో పాటు భవన నిర్మాణానికి రూ.10 లక్షలు ఇస్తానని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. విశ్రాంత కార్మికులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనందం, ఎన్‌ఎండీసీ మాజీ చీఫ్ జనరల్ పద్మారావు, నేషనల్ ఎజిటేషన్ కమిటీ అధ్యక్షులు లక్ష్మి, బాన్సువాడ విశ్రాంత కార్మికులు పాల్గొన్నారు.