
మద్యం దుకాణాల రిజర్వేషన్లకు డ్రా
కామారెడ్డి క్రైం: నూతన మద్యం పాలసీ (2025–27)లో భాగంగా జిల్లాలో 49 మద్యం దుకాణాల నిర్వహణకు గురువారం రిజర్వేషన్లు ఖరారు చేశారు. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో వీడియోగ్రఫీ మధ్య డ్రా తీశారు. జిల్లాలో మొత్తం 49 మద్యం దుకాణాలు ఉండగా వాటిలో ఐదు ఎస్సీ సామాజిక వర్గానికి, రెండు ఎస్టీ సామాజిక వర్గానికి, ఏడు బీసీ గౌడ కులానికి రిజర్వ్ చేశారు. లాటరీ ద్వారా మద్యం దుకాణాలను ఎంపిక చేసి వాటి ఆమోదంకోసం రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ కమిషనర్‌కు పంపించామని కలెక్టర్ తెలిపా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హన్మంతరావు, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి వెంకటేశ్, బీసీ అభివృద్ధి అధికారి జయరాజ్, ఎస్టీ అభివృద్ధి అధికారి సతీశ్, ఎకై ్సజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.