
ఆదర్శ రైతుల ఎంపిక.. సన్మానం
సదాశివనగర్/పిట్లం/భిక్కనూరు/బాన్సువాడ/తాడ్వాయి :లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320డి ఆధ్వర్యంలో ఆదర్శ రైతులను ఎంపిక చేసి ఘనంగా సన్మానించారు. బుధవారం బోధన్ కమ్మ సంఘంలో బాన్సువాడ మండలం దేశాయిపేట్‌కు చెందిన జంగం బసప్ప, బీర్కూర్ మండలం కిష్టాపూర్‌కు చెందిన పెద్ది నర్సారెడ్డి, సదాశివనగర్‌కు చెందిన కోతి లింబారెడ్డి, తాడ్వాయికి చెందిన భీమన్నగారి ధర్మారెడ్డి, పిట్లం మండలం తిమ్మాపూర్‌కు చెందిన బుజ్జారెడ్డి, భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన అంబళ్ల మల్లేశంలను ఆదర్శ రైతులుగా ఎంపిక చేసి సన్మానించారు. ఈ సందర్భంగా లయన్స్ ప్రతినిధులు మాట్లాడుతూ..రైతు దేశానికి వెన్నెముక లాంటోడని, రైతు లేని సమాజం ఉహించ లేనిదని, రైతు కష్టాన్ని గుర్తించాల్సి బాధ్యత మనందరిదని అన్నారు.