
ప్రాసెసింగ్ యూనిట్ల కోసం స్థలాల పరిశీలన
నిజాంసాగర్/మద్నూర్: సోయా, పప్పుదినుసుల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం శాస్త్రవేత్తల బృందం బుధవారం మద్నూర్, జుక్కల్‌లలో పర్యటించింది. పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్‌కుమార్, మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య, వైస్ చైర్మన్ పరమేశ్ పటేల్‌లు వారికి స్థలాలను చూపించారు. ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు స్థలాలతోపాటు మద్నూర్ మార్కెట్‌లోని గోదాములను పరిశీలించారు. సోయా పంటపై ఆరా తీశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సోయా, పప్పుదినుసుల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకోసం కృషి చేస్తున్నారని పిట్లం ఏఎంసీ చైర్మన్ మనోజ్‌కుమార్ అన్నారు. స్థల పరిశీలనకు వచ్చిన బృందంలో ఇక్రిశాట్ సీనియర్ అధికారి తమిర్ సెల్వి, అసిస్టెంట్ మేనేజర్ ప్రియాంక, రీసెర్చ్ అసోసియేషన్ టీం మేనేజర్ రాజశేఖర్, సభ్యులు సురేష్‌కుమార్, గంగారాం తదితరులున్నారు.