సంఘమేశ్వర్ వద్ద బీటీ రోడ్డు దెబ్బతినడంతో తాత్కాలికంగా పోసిన మొరం
దోమకొండ నుంచి ముత్యంపేటకు వెళ్లే
మార్గంలో కోతకు గురైన రోడ్డు
దోమకొండ: మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా దోమకొండ మండల కేంద్రం నుంచి ముత్యంపేట, గొట్టిముక్కుల, సంఘమేశ్వర్ గ్రామాలకు వెళ్లే రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వర్షాలకు రోడ్లపై గుంతలు పడి, ఇరువైపులా కోతకు గురైంది. దీంతో రాత్రి వేళల్లో వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. గత రెండు రోజుల క్రితం దోమకొండ నుంచి సంఘమేశ్వర్ గ్రామానికి యువకుడు కారులో వెళుతుండగా, ఎడ్లకట్ట వాగు దాటిన తర్వాత కోతకు గురైన రోడ్డు వద్ద ప్రమాదానికి గురయ్యాడు. ఈఘటనలో యువకుడు గాయపడగా, కారు సైతం దెబ్బతిన్నది. అధికారులు స్పందించి దెబ్బతిన్న రోడ్లను వెంటనే బాగు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
మరమ్మతులు చేయించండి మహాప్రభో..