లింగంపల్లికలాన్‌ రోడ్డుకు మరమ్మతులు | - | Sakshi
Sakshi News home page

లింగంపల్లికలాన్‌ రోడ్డుకు మరమ్మతులు

Sep 24 2025 5:31 AM | Updated on Sep 24 2025 5:31 AM

లింగం

లింగంపల్లికలాన్‌ రోడ్డుకు మరమ్మతులు

లింగంపల్లికలాన్‌ రోడ్డుకు మరమ్మతులు అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టిక ఆహారం

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని బంజర–లింగంపల్లికలాన్‌ రోడ్డుకు ఎట్టకేలకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఈ నెల 17న ‘సాక్షి’ దినపత్రికలో ‘దెబ్బతిన్న బంజర–లింగంపల్లికలాన్‌ రోడ్డు’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి పంచాయతీరాజ్‌ అధికారులు స్పందించారు. భారీ వర్షాలతో రోడ్డు రెండు చోట్ల దెబ్బతిని భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ మేరకు రెండు చోట్ల భారీ సిమెంట్‌ పైపులను ఏర్పాటు చేసి ట్రాక్టర్లతో మొరం పోయించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.

నిజాంసాగర్‌(జుక్కల్‌): రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌ వాడి కేంద్రాల ద్వారా సరఫరా చేస్తున్న పౌష్టిక ఆహారాన్ని గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని మహమ్మద్‌నగర్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం తుంకిపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో పోషణ్‌ అభియాన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రవీందర్‌ రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ రాజేశ్వరి నాయకులు కుమ్మరి రాములు, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

లింగంపల్లికలాన్‌ రోడ్డుకు మరమ్మతులు1
1/1

లింగంపల్లికలాన్‌ రోడ్డుకు మరమ్మతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement