
మూల మలుపులు.. మృత్యు పిలుపులు
పెద్దకొడప్‌గల్(జుక్కల్): మండలంలోని కాస్లాబాద్ నుంచి వడ్లం గ్రామానికి వెళ్లే దారిలో మూల మలుపులు ప్రమాదకరంగా ఉన్నాయి. 10కి పైగా గ్రామాలు, తండాల ప్రజలు నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తారు. మూలమలుపుల వద్ద కనీసం సూచిక బోర్డులు కరువయ్యాయి. రోడ్డుకు ఇరువైపులా ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు మొలవడంతో, మూలమలుపు వద్ద వచ్చి పోయే వాహనదారులకు ఏమీ కనపడక ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి మూల మలుపులున్న చోట ముళ్ల పొదలు, పిచ్చిమొక్కలు తొలగించి, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

మూల మలుపులు.. మృత్యు పిలుపులు