
నిధుల వరదేదీ?
జిల్లాలో వరదలతో సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు
న్యూస్‌రీల్
– 9లో u
బుధవారం శ్రీ 24 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
– 8లో u
‘‘ జిల్లాలో నష్టంపై పదిహేను రోజుల్లో పూర్తి స్థాయిలో సమీక్షిస్తా. ఈ లోపు అధికారులు క్షేత్ర స్థాయిలో తిరిగి జరిగిన నష్టాలపై సరైన నివేదిక రూపొందించండి. శాశ్వత పరిష్కారం చూపడానికి అయ్యే వ్యయానికి సంబంధించిన నివేదికలు తయారు చేయండి. వారం రోజుల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి రెండు జిల్లాల అధికారులతో మంత్రి సీతక్క రివ్యూ చేస్తారు. ఆ లోపు నివేదికలు అందించండి’’
– ఈనెల 4న జిల్లాలో పర్యటించిన
సందర్భంగా అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
సీఎం ఈ ప్రకటన చేసి ఇరవై రోజులవుతు న్నా మంత్రి సీతక్క ఇప్పటికీ వరద నష్టంపై సమీక్షించింది లేదు. ముఖ్యమంత్రి రివ్యూ ఊసూ లేదు.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో గతనెల చివరి వారంలో కురిసిన భారీ వర్షాలు, వచ్చిన వరదలతో భారీ నష్టం వాటిల్లింది. జనజీవితం అతలాకుతలమైంది. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వాగులు పొంగి పొర్లడంతో వంతెనలు, రోడ్లు కొ ట్టుకుపోయాయి. జిల్లా కేంద్రంలో మూడు కాలనీ లు నీట మునిగాయి. వందలాది కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయి. జిల్లాలో దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, చెరువులు, ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టేందుకు రూ. 251.36 కోట్లు అవసరమవుతాయని ఆయా శాఖల అధికారులు అంచనా వేశారు. ఇందులో తక్షణ మరమ్మతుల కోసం రూ. 38.68 కోట్లు, పూర్తి స్థాయి పనులకు రూ.212.68 కోట్లు అవసరం అవుతాయని పేర్కొన్నారు. అయితే ఈనెల 4న జిల్లాలో దెబ్బతిన్న పంటలు, కూలిపోయిన వంతెనలు, కొట్టుకుపోయిన రోడ్లు, వరదలతో నీట మునిగిన ఇళ్లను పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి.. బాధితుల ను ఆదుకునే బాధ్యత తమదన్నారు. సమస్యకు శా శ్వత పరిష్కారం చూపుతామని కూడా పేర్కొన్నా రు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క నష్టంపై రివ్యూ చేస్తారని, పదిహేను రోజుల్లో తాను సమీక్షిస్తానని సీఎం అన్నారు. ఇరవై రోజులు గడచినా ఇప్పటికీ ఎ లాంటి రివ్యూ జరగలేదు. ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో జిల్లా ప్రజలు నిరాశకు గురవుతున్నారు. స్వయంగా సీఎం పర్యటించి వెళ్లినా ఒనగూరిందేమీ లేదని ప్రతిపక్షనేతలు ఆరోపిస్తున్నారు.
భారీ వర్షాలు సృష్టించిన బీభత్సానికి నీటి వనరులు దెబ్బతిన్నాయి. పోచారం ప్రాజెక్టుతో పాటు కల్యాణి ప్రాజెక్టు, సింగితం రిజర్వాయర్‌తో సహా 203 చెరువులు, కాలువలకు నష్టం జరిగింది. తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.5 కోట్లు అవసరమని, పూర్తి స్థాయిలో నిర్మించేందుకు రూ. 44 కోట్లు అవసరమవుతాయని నీటి పారుదల శాఖ అధికారులు నివేదికలు రూపొందించారు.
జిల్లాలో గతనెలలో వచ్చిన వరదలతో జరిగిన నష్టాన్ని స్వయంగా చూసిన సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఎన్నడూ లేనంత నష్టం జరిగిన నేపథ్యంలో ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో జరిగిన నష్టానికి సంబంధించి రూ.500 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తేనే న్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు సీఎంతో మాట్లాడి ప్రత్యేక ప్యాకేజీ తీసుకురావాలని కోరుతున్నారు.
వరదలు, వర్షాలతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
1,454 ఇళ్లు దెబ్బతిన్నాయి.
118 పశువులు, 53,270 కోళ్లు మత్యువాత పడ్డాయి.
334 గ్రామాల్లో 37,313 మంది రైతులకు సంబంధించి 50,028 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.
140 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బ
తిన్నాయి.
విద్యుత్ శాఖకు సంబంధించి 38 గ్రామాల్లో 864 విద్యుత్ స్తంభాలు , 51.84 కిలో
మీటర్ల వైర్లు దెబ్బతినగా..
589 ట్రాన్స్‌ఫార్మర్లు పాడయ్యాయి.
50 వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు..
జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాలు, వచ్చిన వరదలతో 50 వేల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయి. సీఎం పర్యటన సమయంలో 50,028 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు నివేదికల్లో పేర్కొన్నారు. తర్వాత పంట నష్టం లెక్కలు తగ్గించారు. వరదలతో పొలాల్లో ఇసుక మేటలను తొలగించే పనులను ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టారు. రైతుకు జాబ్ కార్డులు ఉండాలన్న నిబంధనతో చాలా మందికి ఆ అవకాశం కూడా దొరకడం లేదు. ఎకరా పంట సాగుకు తక్కువలో తక్కువ రైతులు రూ.20 వేలు పెట్టుబడులు పెట్టారు. పంట ఎదుగుతున్న సమయంలో దెబ్బతినడంతో మరింత నష్టం వాటల్లింది. పెట్టిన పెట్టుబడులే దాదాపు రూ. వంద కోట్ల మేర రైతులకు నష్టం జరిగింది. నీట మునిగిన పంటలతో పాటు, వరదలతో కొట్టుకుపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కూడా నిర్వహించారు. ఆలస్యం చేయకుండా ప్రభుత్వం వెంటనే పరిహారం ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యను పెండింగ్‌లో పెడితే మరికొన్ని ప్రాంతాల్లో రైతులు ఆందోళనలకు దిగే అవకాశాలు ఉన్నాయి.
రోడ్లకు భారీ నష్టం..
పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖలకు సంబంధించి రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. రోడ్లు భవనాల శాఖ ద్వారా పనులు చేపట్టేందుకు రూ. 125.50 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అలాగే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి రూ. 45.50 కోట్లు అవసరమని ప్రతిపాదనలు రూపొందించారు. సీఎం పర్యటన సందర్భంగా ఆయా శాఖల అధికారులు జరిగిన నష్టం వివరాలతో నివేదికలను అందించారు. తాత్కాలిక మరమ్మతులు తప్ప పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టేందుకు ఇప్పటివరకు ఎలాంటి నిధులు రాలేదు. కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డికి వెళ్లే ప్రధాన రహదారిపై లింగంపేట మండలం లింగంపల్లి కలాన్ వద్ద వంతెన దెబ్బతినడంతో బస్సులు నడపలేని పరిస్థితి ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఈ వంతెనను పరిశీలించారు. ఇక్కడ తాత్కాలిక రోడ్డు నిర్మాణం పనులు మొదలయ్యాయి. కాగా పర్మనెంట్‌గా వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాల్సి ఉంది. అలాగే ఎల్లారెడ్డి – మెదక్ రహదారిపై పోచారం ప్రాజెక్టు కింద వంతెన వద్ద ఏర్పడిన గొయ్యితో రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. జిల్లాలోని మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జిల్లాలో భారీ వర్షాలతో అపార నష్టం
ప్రభావిత ప్రాంతాలను
పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి
పక్షం రోజుల్లో సమీక్షిస్తానని హామీ
ఇరవై రోజులైనా రివ్యూ లేదు,
నిధులూ రాలే..
పునరుద్ధరణకు నోచుకోని వంతెనలు, రోడ్లు, చెరువులు
దెబ్బతిన్న పంటలకు అందని పరిహారం
సాయం కోసం రోడ్డెక్కుతున్న రైతాంగం

నిధుల వరదేదీ?

నిధుల వరదేదీ?