
వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
మాచారెడ్డి : గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం చుక్కాపూర్‌లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను తనిఖీ చేశారు. గ్రామస్తులతో మాట్లాడి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో అందుతున్న సేవల గురించి ఆరా తీశారు. డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌తో మాట్లాడి ఎలాంటి వసతులు ఉన్నాయి, ఇంకా ఏ వసతులు కల్పించాలన్న విషయాలు తెలుసుకున్నారు. జిల్లాలోని ఆయుష్మాన్ మందిర్‌లకు కావలసిన సామగ్రికి ప్రతిపాదనలు అందించాలని సూచించారు. తాగునీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో ప్రభుకిరణ్, తహసీల్దార్ సరళ, వైద్యాధికారి ఆదర్శ్, వైద్య సిబ్బంది ఉన్నారు.
రోడ్డు పనుల పరిశీలన
ఇటీవల వర్షాలతో దెబ్బతిన్న పాల్వంచ మండలం పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి మంథని దేవునిపల్లి వరకు ఉన్న రోడ్డుకు జరుగుతున్న మరమ్మతులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరదలతో దెబ్బతిన్న రోడ్లకు త్వరగా మరమ్మతులు చేసి రాకపోకలను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ ఈఈ దుర్గాప్రసాద్, పాల్వంచ తహసీల్దార్ హిమబిందు, ఎంపీడీవో శ్రీనివాస్, పంచాయతీరాజ్ డీఈ స్వామిదాస్, ఏఈ సంజయ్ తదితరులున్నారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్