
‘ప్రీ ప్రైమరీని అంగన్‌వాడీలోనే కొనసాగించాలి’
కామారెడ్డి టౌన్: ప్రీ ప్రైమరీ స్కూలు పీఎం శ్రీవిద్యను అంగన్‌వాడీ కేంద్రాలలోనే కొనసాగించాలని తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగిన యూనియన్ మహాసభలలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం అంగన్‌వాడీ టీచర్లకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కింద రూ. 2 లక్షలు తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
జిల్లా కమిటీ ఎన్నిక
యూనియన్ జిల్లా అధ్యక్షురాలిగా ఇందిర, గౌరవ అధ్యక్షుడిగా చంద్రశేఖర్, కార్యదర్శిగా బాబాయి, కోశాధికారిగా సరిత, ఉపాధ్యక్షులుగా లక్ష్మి, యాదమ్మ, అనసూయ, దేవకరుణ, మహాదేవి, సహాయ కార్యదర్శులుగా విజయ, సురేఖ, సునీత, సుమలత, గౌరి, సవిత ఎన్నికయ్యారు.