
నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ వరద
నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు, కౌలాస్ ప్రాజెక్టులకు భారీ ఇన్‌ఫ్లో వస్తోంది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 60,630 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు పది గేట్లను ఎత్తి 77,446 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదులుతున్నారు.
కౌలాస్ ప్రాజెక్టులోకి..
కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సోమవారం రాత్రి కౌలాస్ ప్రాజెక్టులోకి 7,827 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు నాలుగు వరద గేట్లు ఎత్తి 10,436 క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు(1.237 టీఎంసీలు) కాగా.. సోమవారం రాత్రి వరకు 457.95 మీటర్ల(1.225 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.