
బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి రిమాండ్
ఖలీల్‌వాడి: బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇ ద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. ఈ నెల 19న సిరికొండ మండలం తూంపల్లి గ్రామ పరిధిలోని వర్జిన్ తండాకు చెందిన భూక్య విఠల్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద పా ర్క్ చేసిన తన బైక్ కనిపించకపోవడంతో ఫిర్యాదు చేశాడు. సోమవారం ఉదయం దేవీరోడ్ వద్ద వా హనాల తనిఖీ చేపడుతుండగా నిర్మల్ జిల్లా భైంసాలోని ఓవైసీ నగర్‌కు చెందిన హనువాతే భీమ్, హనువాతే సుభాష్ దొంగిలించిన బైక్‌పై వస్తూ పో లీసులను చూసి పారిపోయేందుకు యత్నించారు. వారిని పట్టుకొని విచారించగా నగరంలోని 50 క్వా ర్టర్స్‌లో నివాసముంటూ మద్యం, జల్సాల కోసం బైక్ దొంగతనాలు చేస్తున్నట్టు ఒప్పుకున్నారు. భైంసా, నందిపేట్, బాల్కొండ ప్రాంతాల్లో కూడా బైక్ దొంగతనాలు చేసినట్లు నిందితులు వెల్లడించారు. వారి నుంచి నాలుగు బైక్‌లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.