
బతుకమ్మ సంబురాలను విజయవంతం చేయండి
బాన్సువాడ రూరల్: బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 25న బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించే తెలంగాణ బతుకమ్మ సంబురాలను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సోమవారం ఆయన బాన్సువాడలో ఆ పార్టీ నాయకులతో కలిసి మాట్లాడారు. బతుకమ్మ సంబురాలకు ముఖ్య అతిథిగా బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారన్నారు. తెలంగాణలో అతిపెద్ద పండుగలైన బతుకమ్మ, దసరా పండుగలు సమీపిస్తున్నా ప్రభుత్వం గ్రామాల్లో పరిశుభ్రత కోసమైనా ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజలు కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారన్నారు. నాయకులు మహ్మద్ జుబేర్, ముజీబుద్దీన్, అంజిరెడ్డి, నార్ల రత్నకుమార్, బోడ చందర్, మోచీ గణేష్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.