
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు క్రీడాకారుల ఎంపిక
గాంధారి/మాచారెడ్డి/కామారెడ్డి అర్బన్: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక సరస్వతి విద్యామందిర్ హైస్కూల్ మైదానంలో సబ్ జూనియర్ బాలబాలికల ఎంపికలు నిర్వహించారు. అత్యంత ప్రతిభ చూపిన 15 మంది బాలురు, 18 మంది బాలికలను ఎంపిక చేసినట్టు అసోసియేషన్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి బాణాల భాస్కర్‌రెడ్డి తెలిపారు. వీరు ఈ నెల 25 నుంచి 28 వరకు నిజామాబాద్ జిల్లా ముప్కాల్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి 35వ సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారన్నారు. టీజీ పేటా జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు రాజయ్య, అనిల్‌కుమార్, నరేష్‌రెడ్డి, నవీన్, లక్ష్మణ్, బాలు, సతీష్‌రెడ్డి, రేణుక, రాజు, సంజీవ్, లావణ్య, సీనియర్ కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు.