
గుంతల పూడ్చివేత
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రం నుంచి ధర్మారావ్‌పేట్‌కు వెళ్లే బీటీ రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారడంతో విషయాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన వెంటనే స్పందించి రోడ్డుపై ఏర్పడ్డ గుంతలను పూడ్చి వేయించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఏనుగు సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్ బడాల భాస్కర్ రెడ్డి, నాయకులు బల్‌రాం, లక్ష్మణ్, ఆంజనేయులు, సంతోష్, ప్రవీణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ రూరల్: అన్ని దానాల కన్నా రక్తదానం చాలా గొప్పదని, యువకులు రక్తదానం అలవాటుగా మార్చులకోవాలని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ కామారెడ్డి జిల్లా సభ్యుడు సునీల్ రాథోడ్ అన్నారు. మేరా యువ భారత్‌లో భాగంగా మండలంలోని ఎస్‌ఎస్‌ఎల్ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి మాట్లాడారు. రక్తదానం చేయడం ద్వారా ఒకరికి పునర్జన్మ కల్పించిన వారవుతారన్నారు. రోడ్డు ప్రమాదాలు, సిజేరియన్ డెలివరీల సమయంలో రక్తం అవసరం ఉంటుందన్నారు. యువత రక్తదానం పట్ల పెద్దగా ఆసక్తి కనబర్చకపోవడం బాధాకరమన్నారు. అపోహలు వీడి యువత రక్తదానానికి ముందుకు రావాలన్నారు. రక్తదానం చేసిన యువకులకు సర్టిఫికెట్లు అందజేశారు. కళాశాల ప్రిన్సిపల్ సుభాష్‌గౌడ్, లక్ష్మణ్, అంజయ్య, నాగరాజు పాల్గొన్నారు.

గుంతల పూడ్చివేత