
ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య
● ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి దాసరి ఒడ్డెన్న
మాచారెడ్డి/బీబీపేట/సదాశివనగర్(ఎల్లారెడ్డి): ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ఉమ్మడి జిల్లా ఇంటర్మీడియట్ ప్రత్యేకాధికారి దాసరి ఒడ్డెన్న అన్నారు. సోమవారం మాచారెడ్డి, బీబీపేట, సదాశివనగర్ మండలాల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ..తరగతులకు హాజరుకాని విద్యార్థులను హాజరయ్యేలా చూడాలన్నారు. అవసరమైతే ఇంటింటికీ తిరుగుతూ విద్యార్థులను కళాశాలకు రెగ్యులర్‌గా హాజరయ్యేలా చూడాలన్నారు. కళాశాలలో ఎఫ్‌ఆర్‌ఎస్, హెచ్‌ఆర్‌ఎంఎస్ డాటాను తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతం, యూనిట్ టెస్ట్‌ల నిర్వహణ, ఫలితాల వివరాలను తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు, కార్యాలయ సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు.