ఇద్దరూ ఇద్దరే! | - | Sakshi
Sakshi News home page

ఇద్దరూ ఇద్దరే!

Sep 22 2025 7:10 AM | Updated on Sep 22 2025 7:10 AM

ఇద్దర

ఇద్దరూ ఇద్దరే!

న్యూస్‌రీల్‌

సంబురం షురూ..

వాతావరణం

అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

దుర్గా పూజకు వేళాయె

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. జిల్లావ్యాప్తంగా మండపాలు ఏర్పాటు చేశారు.

– 11లో u

సోమవారం శ్రీ 22 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

– 10లో u

ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

బాన్సువాడ : బతుకమ్మ, దసరా పండగలకు ఆర్టీసీ నుంచి ప్రత్యేక బస్సుల సౌకర్యం కల్పించనున్నట్లు డీఎం సరితాదేవి తెలిపారు. ఈనెల 22 నుంచి వచ్చేనెల 2 వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రధాన రూట్లలో ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు నడుపనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్లు చేసుకునే అవకాశం కల్పించామని పేర్కొన్నారు.

శరన్నవరాత్రి ఉత్సవాలకు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు

కామారెడ్డి క్రైం: శరన్నవరాత్రి ఉత్సవాలకు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేశామని ఎ స్పీ రాజేశ్‌ చంద్ర ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని కోరా రు. మండపాలు ఏర్పాటు చేసేవారు తప్పని సరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసు శాఖ భద్ర తా చర్యలను సమర్థవంతంగా అమలు చే యగలుగుతుందని పేర్కొన్నారు. ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, నిర్దేశిత సమయానికి శోభాయాత్ర, విగ్ర హ నిమజ్జనం పూర్తి చేయాలని సూచించా రు. రాత్రి 10 గంటల తర్వాత లౌడ్‌ స్పీకర్లు వాడకూడదని, 24 గంటల పాటు మండపా ల వద్ద వలంటీర్‌లు తప్పనిసరిగా ఉండాల ని పేర్కొన్నారు. అనుమానాస్పద వస్తువు లు, వ్యక్తులు కనబడితే వెంటనే డయల్‌ 100 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సా మాజిక మాధ్యమాలలో వచ్చే వదంతులను నమ్మవద్దని కోరారు.

బీఎస్‌ఎస్‌ అర్చక విభాగం రాష్ట్ర

అధ్యక్షుడిగా రామగిరిశర్మ

భిక్కనూరు: బ్రాహ్మణ సేవా సంఘం(బీఎస్‌ఎస్‌) రాష్ట్ర అర్చక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా భిక్కనూరు శ్రీసిద్దరామేశ్వరాలయం అర్చకులు కొడకండ్ల రామగిరిశర్మ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య చైర్మన్‌ వెన్నంపల్లి జగన్‌మోహన్‌ ఆదివారం నియామక ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా రామగిరిశర్మ మాట్లాడుతూ 25 ఏళ్లుగా బ్రాహ్మణ సేవాసంఘ సమాఖ్యలో వివిధ హోదాల్లో పనిచేసిన తనను సమాఖ్య అర్చక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

నేటి నుంచి టీపీటీఎఫ్‌ అధ్యయన తరగతులు

కామారెడ్డి టౌన్‌ : జిల్లా కేంద్రంలో ఈనెల 22, 23వ తేదీలలో తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(టీపీటీఎఫ్‌) రాష్ట్ర స్థాయి అధ్యయన తరగతులు నిర్వహించనున్నట్లు సమాఖ్య జిల్లా అధ్యక్షుడు లింగం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాత రాజంపేట్‌ రైల్వే గేట్‌ వద్దనున్న లేపాక్షి హోమ్స్‌ కమ్యూనిటీ హాల్‌లో తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్‌తో పాటు రాష్ట్ర, జిల్లా నేతలు పాల్గొంటారని తెలిపారు. అధ్యయన తరగ తులను విజయవంతం చేయాలని కోరారు.

క్యాసంపల్లిలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన పూల పండుగ ఆదివారం జిల్లాలో ఘనంగా ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా మహిళలు తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ పేర్చారు. అనంతరం బతుకమ్మ ఆడి

సంబురాలు చేసుకున్నారు.

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో ఇద్దరు ముఖ్య అధికారులు తమదైన శైలిలో పనిచేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, క్షేత్ర స్థాయిలో పరిశీలన చేస్తూ అలసత్వం వహించేవారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఎస్పీ రాజేశ్‌ చంద్ర నేరాల విషయంలో అధికారులను అప్రమత్తం చేసి కేసులను ఛేదించడంలో విజయవంతంగా సాగుతున్నారు. మరోవైపు ఎవరైనా తప్పు చేస్తే శాఖాపరమైన చర్యలకు వెనకాడడం లేదు. గతనెల చివరి వారంలో కురిసిన భారీ వర్షాలు, వచ్చిన వరదలు జిల్లాను అతలాకుతలం చేశాయి. వరదలలో చిక్కుకున్నవారి విషయంలో ఇద్దరు అధికారులు చురుకుగా పనిచేసి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇరువురూ పనితీరుతో ప్రభుత్వ పెద్దల మన్ననలు పొందారు.

పనితీరుతో ప్రత్యేకతను చాటుకుంటున్న ఉన్నతాధికారులు

అధికారులను పరుగులు పెట్టిస్తున్న

కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌

నేరాలకు కళ్లెం వేయడంలో

ఎస్పీ రాజేశ్‌ చంద్ర తనదైన ముద్ర

ఇద్దరూ ఇద్దరే!1
1/6

ఇద్దరూ ఇద్దరే!

ఇద్దరూ ఇద్దరే!2
2/6

ఇద్దరూ ఇద్దరే!

ఇద్దరూ ఇద్దరే!3
3/6

ఇద్దరూ ఇద్దరే!

ఇద్దరూ ఇద్దరే!4
4/6

ఇద్దరూ ఇద్దరే!

ఇద్దరూ ఇద్దరే!5
5/6

ఇద్దరూ ఇద్దరే!

ఇద్దరూ ఇద్దరే!6
6/6

ఇద్దరూ ఇద్దరే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement