
బంగారం క్యారెట్ల విలువ!
మీకు తెలుసా..
మీ డిజి పిన్ తెలుసుకోండి?
సమాచారం..
ఖలీల్‌వాడి: మనం సాధారణంగా అడ్రస్ తెలిపేటప్పుడు పోస్ట్‌కార్డు లేదా దరఖాస్తులు ఇతర వాటిపైన ఖచ్చితంగా పిన్‌కోడ్ నెంబర్‌ను రాస్తాం. అయినప్పటీకి ఖచ్చితమైన అడ్రస్‌ను ఎక్కడ ఉన్నది కొన్ని సందర్బాల్లో కనుక్కోవడం కష్టంగా అవుతుంది.
దీనిని అధిగమించడానికి పది అంకెల ఆల్ఫా న్యూమరిక్ డిజి పిన్‌ను పోస్టల్ శాఖ(తపాలాశాఖ) అందుబాటులోకి తీసువచ్చింది.
పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక శాఖ వంటి సేవలతోపాటు ఆన్‌లైన్ ఆర్డర్ల డెలివరీల కోసం ఈ డిజిపిన్ ఉపయోగిస్తున్నారు.
సాధారణ పోస్టల్ చిరునామా ప్రాంతం, వీధి, ఇంటి సంఖ్యలపై ఆధారపడి ఉంటుంది. కానీ DIGIPIN అనేది ఒక స్థానం యొక్క ఖచ్చితమైన కోఆర్డినేట్‌ల ఆధారంగా 10–అక్షరాల ఆల్ఫాన్యూమరిక్ కోడ్‌ను ఉపయోగించే జియోస్పేషియల్ రిఫరెన్స్.
DIGIPIN చిరునామా నిర్వహణను సులభతరం చేస్తుంది. ముఖ్యంగా నిర్మాణాత్మకంగా లేని లేదా మారుతున్న చిరునామాలు ఉన్న ప్రాంతాలలో ఖచ్చితమైన స్థానం, ఆధారిత గుర్తింపును అందిస్తుంది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాలు, అడవులు, మహాసముద్రాలు వంటి స్పష్టమైన చిరునామా లేని ప్రాంతాలలో కూడా ఇది సహాయపడుతుంది.
డిజిపిన్ జనరేట్ చేసుకోండి..
మొదట పోస్టల్ వెబ్‌సెట్‌లోకి వెళ్లి అందులో కనిపించే నో యువర్ పిన్‌కోడ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
తర్వాత ‘నో యువర్ డిజిపిన్’పై క్లిక్ చేయాలి. లొకేషన్ యాక్సెక్ పాస్‌ఆప్‌లో ఆప్షన్ ఎంటర్ చేయాలి.
అనంతరం స్క్రీన్ పైన కుడి వైపున ఆంగ్ల అక్షరాలు, అంకెలతో కూడిన పదంకెల డిజి పిన్ కనిపిస్తుంది.
లేదా డిజిపిన్ కోసం తపాలా శాఖ ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకొచ్చిన వెబ్‌సైట్‌లోని లింక్‌పై క్లిక్ చేయగానే మీరు ఉన్న లొకేషన్ డిజి పిన్ కనిపిస్తుంది.
సదాశివనగర్(ఎల్లారెడ్డి): బంగారం కొనుగోలు చేసే ముందు వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా బంగారం నాణ్యతను గుర్తించి మోసాలకు చెక్ పెట్టొచ్చు. బంగారం స్వచ్ఛతను క్యారెట్ల రూపంలో కొలుస్తారు. 99.9 శాతం స్వచ్ఛత ఉన్న బంగారాన్ని 24 క్యారెట్ల బంగారం అంటారు. దీనితో ఆభరణాలు చేయరు. ఇది బిస్కెట్ రూపంలోనే ఉంటుంది.
22 క్యారెట్లు: 91.6 శాతం బంగారం, మిగతా 8.4 శాతం ఇతర లోహాలు కలుస్తాయి. 18 క్యారెట్లు: 75 శాతం బంగారం, మిగతా 25 శాతం ఇతర లోహాలు
14 క్యారెట్లు: 58.5శాతం బంగారం, మిగతా భాగం ఇతర లోహాలు
12క్యారెట్లు: 50 శాతం మాత్రమే బంగారం, మిగతా 50 శాతం ఇతర లోహాలు మిశ్రమంతో తయారీ అవుతుంది.
10 క్యారెట్లు: 41.7 శాతం బంగారం మాత్రమే ఉంటుంది.
బంగారం ఆభరణాలు తయారీలో కాడ్మియంతో సోల్జరింగ్ చేయడాన్ని కేడీఎం అంటారు. ఇవి 91.6 నాణ్యతతో ఉంటాయి.
ఆభరణం చిన్నదైనా, పెద్దదైనా హాల్‌మార్క్ ముద్ర, నాణ్యత శాతాన్ని సూచించే నంబర్‌తోపాటు ఆ వస్తువు సర్టిపై చేసిన హాల్‌మార్క్ సెంటర్ వివరాలు తెలిపే హెచ్‌యూఐడీ హాల్‌మార్క్ యూనిక్ ఐడీ నంబరు విధిగా ఉండాలి.
ఈ అన్ని వివరాలను కొనుగోలు రశీదులో పొందుపర్చి వినియోగదారుడికి అందించాల్సి ఉంటుంది.

బంగారం క్యారెట్ల విలువ!