104 సిబ్బంది సర్దుబాటు | - | Sakshi
Sakshi News home page

104 సిబ్బంది సర్దుబాటు

Sep 22 2025 7:08 AM | Updated on Sep 22 2025 7:08 AM

104 సిబ్బంది సర్దుబాటు

104 సిబ్బంది సర్దుబాటు

డీఈ ఆపరేటర్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ స్టాఫ్‌

కామారెడ్డి మెడికల్‌ కళాశాలకు బదిలీ

ఫార్మసిస్ట్‌, ల్యాబ్‌ టెక్నిషియన్ల

బదిలీలకు తాత్కాలిక బ్రేక్‌

నిజామాబాద్‌నాగారం: నిజామాబాద్‌ జిల్లాలో సంచార వైద్య సేవలు అందించే 104 వాహన సిబ్బందికి బదిలీలు చేయనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా జిల్లాలో ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పని చేస్తున్న 35మంది ఉద్యోగులను కామారెడ్డి జిల్లాకు కేటాయించనున్నట్లు తెలిసింది. ఆదేశాలు నేడో.. రేపో రానున్నాయి. ఇప్పటికే కామారెడ్డి మెడికల్‌ క ళాశాలకు డీఎంఈ నుంచి మెయిల్‌ వచ్చినట్లు సమాచారం. సొంత జిల్లాలో బదిలీ చేయకుండా పక్క జిల్లాకు బదిలీ చేయనుండటంతో జిల్లాలో పని చేస్తున్న 104 ఉద్యోగులు నేడు డీఎంఈ(డైరెక్ట ర్‌ ఆఫ్‌ హెల్త్‌)ను కలవడానికి వెళ్తున్నట్లు తెలిపారు.

ఉమ్మడి జిల్లాలో 84 మంది ఉద్యోగులు

2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రజలకు ఇంటివద్దనే వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో 104 పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు 104 వాహనాలు 12 కేటాయించారు. ప్రతి వాహనంలో ఫార్మసిస్టు, ల్యాబ్‌టెక్నిషిన్‌, డాటా ఎంట్రీ ఆపరేటర్‌, డ్రైవర్‌ ఉండేవారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 84 మంది ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన సిబ్బంది ఈ విభాగంలో పనిచేస్తున్నారు. 2022లో 104 సేవలను అప్పటి ప్రభుత్వం నిలిపివేసింది. ఈక్రమంలో సిబ్బందిని ఇతర వి భాగాల్లో సర్దుబాటు చేస్తుండగా డాటా ఎంట్రి ఆపరేటర్లు, డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులను కామారెడ్డి జిల్లాకు బదిలీ చేయనున్నారు. తక్కువ జీతాలతో ఏళ్ల తరబడిగా విధులు నిర్వహిస్తున్న చిరుద్యోగులను ఉన్న ఫలంగా ఇతర జిల్లాకు కేటాయించడంపై వారు ఆవేదన చెందుతున్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ, జీజీహెచ్‌ పరిధిలో ఎక్కడ ఖాళీలు లేవని చెప్పడంతో డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఉన్నందున 35 మంది (డాటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లు, సెక్యూరిటీగార్డులు) అక్కడికి వెళ్లి విధులు నిర్వహించాలని ఆదేశాలు వచ్చాయని కన్నీరుపెట్టుకుంటున్నారు. ఫా ర్మసిస్టులు, ల్యాబ్‌ టెక్నిషియన్‌ల బదిలీకి మాత్రం తాత్కాలికంగా పెండింగ్‌ పడింది. ఈ రెండు కేటగిరీలు వైద్యారోగ్యశాఖ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌లో కోటా ఇచ్చినందున ప్రభుత్వ ఉద్యోగులు వచ్చే అవకాశం ఉంది. అందుకే రిక్రూట్‌మెంట్‌ పూర్తయిన తర్వాతా మిగిలి ఉంటే బదిలీ చేయనున్నారు. అప్పటి వరకు కూడా జీతాలు రావని అధికారులు చెప్పిన్నట్లు సిబ్బంది ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement