
క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
మోపాల్: మండలంలోని కంజర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్‌ఎంపీ వైద్యుడు మృతిచెందాడు. ఎస్సై సుస్మిత తెలిపిన వివరాలు ఇలా..నర్సింగ్‌పల్లికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు వెల్దుర్తి గంగాధర్ (53) శనివారం అర్ధరాత్రి నర్సింగ్‌పల్లి నుంచి మోపాల్ వైపు బైక్‌పై బయలుదేరాడు. కంజర్ రెసిడెన్సియల్ స్కూల్ ఎదుట మలుపు వద్ద ప్రమాదవశాత్తు బైక్ అదుపు తప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లాడు. ఈవిషయాన్ని రెసిడెన్సియల్ స్కూల్ వాచ్‌మెన్ గమనించి పోలీసులకు ఫిర్యాదుచేశాడు. పోలీసులుఘటనాస్థలానికి చేసుకుని గంగాధర్‌ను పరీక్షించారు. అప్పటికే మృతిచెందగా, కుటుంబీలకు సమాచారం ఇచ్చారు. మృతదేహానికి పంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చికిత్సపొందుతూ వివాహిత ..
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఆత్మహత్యకు యత్నించిన ఓ వివాహిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై భార్గవ్‌గౌడ్ వివరాలు ఇలా.. నాగిరెడ్డిపేట మండలంలోని అచ్చాయపల్లి గ్రామానికి చెందిన కొంపల్లి కమలాకర్‌కు, మెదక్‌కు చెందిన భవాని(22)కి కొన్ని నెలల క్రితం వివాహం జరిగింది. గత ఆరునెలలుగా దంపతుల మధ్య విభేధాలు తలెత్తడంతో ఇటీవల కుటుంబసభ్యులు జోక్యం చేసుకొని ఇరువురి మధ్య రాజీ కుదిర్చారు. ఈక్రమంలో ఈనెల 16న భవాని పొలానికి వెళ్లి అక్కడ గుర్తుతెలియని విషపదార్థం తాగి, అపస్మారకస్థితిలో పడిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆమెను నిజామాబాద్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా 19న చికిత్సపొందుతూ ఆమె మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలి తల్లి శనివారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.
అనారోగ్యంతో కాంగ్రెస్ నాయకుడు..
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని నందివాడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నా యకుడు సామ రాంరెడ్డి మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మూడు రోజుల క్రితం రాంరెడ్డి అనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. అ క్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడన్నారు. రాంరెడ్డి గతంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం అధ్య క్షుడిగా పనిచేశారు. ఆయన సతీమణి నందివాడ సర్పంచ్‌గా పనిచేసింది.
గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రం శివారులోని పేకాట స్థావరంపై దాడి చేసి పేకాడుతున్న ఏడుగురిని పట్టుకున్నట్లు ఏఎస్సై ప్రకాశ్ ఆదివారం తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు కామారెడ్డి పోలీసులు, స్థానిక పోలీసులతో కలిసి పేకాట స్థావరంపై దాడి చేసినట్లు తెలిపారు. ఏడుగురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.6,190 నగదు, ఐదు బైక్‌లు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్సై తెలిపారు.

క్రైం కార్నర్

క్రైం కార్నర్