
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అడ్డంకులను తొలగించాలి
భిక్కనూరు: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఏవేని అడ్డంకులు ఉన్నా వాటిని తొలగించాలని భిక్కనూరు మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్ సూచించారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీ కార్యదర్శుల సమావేశంలో ఆయన ఎంపీడీవో రాజ్‌గంగారెడ్డితో కలిసి మాట్లాడారు. ఇసుకకు ఇబ్బంది కలుగకుండా చూడాలన్నారు. లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయిలోని శబరిమాత ఆశ్రమ అభివృద్ధికి భక్తులు సహకరించాలని ఆలయ ట్రస్టు కమిటీ అధ్యక్షుడు అనంతరావు అన్నారు. శుక్రవారం ఆశ్రమంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఆశ్రమ అభివృద్ధి, నిత్యన్నదానం, నిత్య పూజా కార్యక్రమాలకు భక్తులు తమవంతు ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని కోరారు. గౌరవ అధ్యక్షుడు శంకరయ్య, సభ్యులు కృష్ణమూర్తి, శ్రీనివాస్, బాలకిషన్, రాఘవరెడ్డి, నర్సిములు, రనీల్‌రెడ్డి, రమశంకర్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
బాన్సువాడ రూరల్: మహిళలు ఆరోగ్యకరమైన ఆహా ర అలవాట్లను అలవర్చుకోవాలని సీ్త్ర శిశు సంక్షేమ శాఖ బాన్సువాడ సీడీపీవో సౌభాగ్య అన్నారు. శుక్రవారం బోర్లం అంగన్‌వాడీ కేంద్రంలో జరిగిన పోషకాహార వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, వృద్ధులకు సరైన పోషకాహారం అవసరమన్నారు. పౌష్టికాహార వంటకాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. జీపీ కార్యదర్శి సాయికుమార్, ఏఎన్‌ఎం శోభ, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశవర్కర్లు, కిషోరబాలికలు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అడ్డంకులను తొలగించాలి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అడ్డంకులను తొలగించాలి