
హిందీ దివస్ పాటల సీడీ ఆవిష్కరణ
కామారెడ్డి అర్బన్: తెలంగాణ రచయితల వేదిక(తెరవే) జిల్లా అధ్యక్షుడు, హిందీ పండిత్ సిరిసిల్ల గఫూర్ శిక్షక్ రచించి రూపొందించిన హిందీ దివస్ పాటల సీడీని డీఈవో రాజు శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. హిందీ గీతాలను గాయకురాలు సుధ పాడగా, సంగీత దర్శకులు అష్ట గంగాధర్ సంగీతం అందించారు. యూట్యూబ్‌లో గఫూర్ శిక్షక్ సాంగ్స్‌లో వినవచ్చన్నారు. జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాంరెడ్డి, ఆదినారాయణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
నిజాంసాగర్(జుక్కల్): జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్రాను శుక్రవారం జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల కురిసిన వర్షాలు, వరద నీటి ప్రవాహాల కారణంగా దెబ్బతిన్న పంట నష్టాన్ని అంచనావేసి రైతులకు నష్ట పరిహారం అందేలా చూడాలని కలెక్టర్‌ను ఆయన కోరారు. వర్షాలకు కూలిన ఇళ్ల బాధితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరినట్లు సింధే తెలిపారు.
కామారెడ్డి టౌన్: బతుకమ్మ, దసరా పండుగల కానుకగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి ట్రాన్స్‌జెండర్‌లకు శుక్రవారం తన నివాసంలో చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పంపరి శ్రీనివాస్, జూలూరి సుధాకర్, చాట్ల వంశీ, ప్రసాద్, మామిడ్ల రమేష్, రంగా రమేష్ గౌడ్, బల్ల శ్రీనివాస్, కిరణ్, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.

హిందీ దివస్ పాటల సీడీ ఆవిష్కరణ

హిందీ దివస్ పాటల సీడీ ఆవిష్కరణ