● నిజాంసాగర్‌లో మంజీర కలిసే చోట పేరుకుపోయిన పూడిక ● నదికి ఇరువైపులా ఆక్రమణలు ● ప్రవాహాన్ని అడ్డుకుంటున్న చెట్లు ● సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం ● ‘సాక్షి’తో నీటి పారుదల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్‌ | - | Sakshi
Sakshi News home page

● నిజాంసాగర్‌లో మంజీర కలిసే చోట పేరుకుపోయిన పూడిక ● నదికి ఇరువైపులా ఆక్రమణలు ● ప్రవాహాన్ని అడ్డుకుంటున్న చెట్లు ● సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం ● ‘సాక్షి’తో నీటి పారుదల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్‌

Sep 20 2025 6:22 AM | Updated on Sep 20 2025 6:22 AM

● నిజ

● నిజాంసాగర్‌లో మంజీర కలిసే చోట పేరుకుపోయిన పూడిక ● నది

● నిజాంసాగర్‌లో మంజీర కలిసే చోట పేరుకుపోయిన పూడిక ● నదికి ఇరువైపులా ఆక్రమణలు ● ప్రవాహాన్ని అడ్డుకుంటున్న చెట్లు ● సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం ● ‘సాక్షి’తో నీటి పారుదల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్‌ చెట్లు అడ్డు తగిలి.. పోచారం ప్రాజెక్టుకు.. కామారెడ్డి పెద్దచెరువుదీ అదే పరిస్థితి..

ప్రాజెక్టులో పూడికతీతకు ప్రతిపాదనలు

50 వేల క్యూసెక్కులు దాటితే..

వెంకంపల్లి శివారులో మంజీర నీటితో ముంపునకు గురైన పంటలు

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ‘‘మంజీర నది నిజాంసాగర్‌ ప్రాజెక్టులో కలిసే చోట పూడిక భారీగా పెరిగిపోయింది. అలాగే చెట్లు కూడా పెరిగాయి. దీనికి తోడు మంజీర నది చాలాచోట్ల ఆక్రమణలతో కుచించుకుపోయింది. ఫలితంగా నది ప్రవాహం ఎక్కువగా ఉన్నపుడు నీరంతా వెనక్కి తన్నుకువచ్చి పంటలు నీట మునుగుతున్నాయి’’ అని నీటి పారుదల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ టి.శ్రీనివాస్‌ పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. జిల్లాలో విస్తారంగా ప్రవహించే మంజీర నది మూలంగా ఏటా వేలాది ఎకరాల పంటలు నీట మునిగి దెబ్బతింటున్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న విషయమై ‘సాక్షి’ నీటి పారుదల శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ టి.శ్రీనివాస్‌తో ముచ్చటించింది. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

నిజాంసాగర్‌ ప్రాజెక్టులో మంజీర నది కలిసే చోట పూడిక భారీగా పేరుకుపోయింది. దానికి తోడు చెట్లు పెరిగిపోయాయి. దీంతో వరద వేగంగా వచ్చినపుడు పూడిక, చెట్ల అడ్డుతగిలి నీరు వెనక్కి వస్తోంది. ఇదే సమయంలో మంజీర నది చాలాచోట్ల ఆక్రమణలకు గురైంది. 4 వందల మీటర్లు ఉండాల్సిన నది కొన్నిచోట్ల వంద మీటర్లకు తగ్గింది. దీంతో వరద నీరు వెనక్కి తన్నినపుడు నది వెడల్పు, లోతు సరిపోక నీరు ఇరువైపులా విస్తారంగా పారి పొలాలు నీట మునిగిపోతున్నాయి. సమస్య పరిష్కారం కోసం మంజీర నది ప్రాజెక్టులో కలిసే చోట పెరిగిన చెట్లను, పూడికను తొలగించడానికి 2023 సంవత్సరంలో రూ. 1.25 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం.

103 ఏళ్ల చరిత్ర ఉన్న పోచారం ప్రాజెక్టు 70 వేల క్యూసెక్కుల వరదను తట్టుకుంటుంది. కానీ ఇటీవ ల ఒక్కసారిగా 1.82 లక్షల క్యూసెక్కుల వరద వ చ్చింది. ఇంత పెద్ద ఎత్తున వరద రావడంతో ప్రాజె క్టు కట్ట పక్కన మట్టి కొట్టుకుపోయింది. వెంటనే అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకుని ఇసుక బ స్తాలు వేసి ప్రమాదం జరగకుండా చూశారు. శాశ్వ త మరమ్మతుల కోసం 12 మీటర్ల లోతు నుంచి వా ల్‌ నిర్మించాల్సి ఉంది.

డ్యామ్‌ సేఫ్టీ యాక్ట్‌ కింద సంబంధిత అధికారులు వచ్చి విచారణ జరిపి వారిచ్చిన డిజైన్‌ ప్రకా రం నిర్మాణం చేపడతాం. తాత్కాలిక మరమ్మతులు చేశాం. పూర్తి స్థాయి మరమ్మతులకోసం రూ.42 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం.

128 ఏండ్ల చరిత్ర ఉన్న కామారెడ్డి పెద్ద చెరువు పటిష్టంగానే ఉంది. అయితే చెరువులోకి ఇటీవల భారీ వరద వచ్చింది. 8 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో తట్టుకునే చెరువులోకి 16,200 క్యూసెక్కుల వరద వచ్చింది. వచ్చింది వచ్చినట్టే బయటకు వెళ్లింది. అయితే 60 మీటర్ల నుంచి 80 మీటర్ల వెడల్పు ఉండాల్సిన వాగు చాలాచోట్ల ఆక్రమణలతో 20 మీటర్ల నుంచి 30 మీటర్లకు కుచించుకుపోయింది. దానికి తోడు వాగులో వ్యర్థాలను నింపడంతో లోతు కూడా తగ్గిపోయింది. దీంతో భారీ వరద వచ్చినపుడు నీరు వెళ్లడానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. వాగు దాదాపు 14 కిలోమీటర్ల మేర ఉంటుంది. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకనుగుణంగా వాగును క్లియర్‌ చేస్తాం.

సింగూరు, కల్యాణీలకూ.

కల్యాణి ప్రాజెక్టు 18 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లోను తట్టుకుంటుంది. కానీ 40 వేల క్యూసెక్కుల వరద రావడంతో కట్ట కొట్టుకుపోయింది. కట్ట నిర్మించేందుకు కోటి రూపాయలతో ప్రతిపాదనలు పంపించాం. అలాగే సింగితం రిజర్వాయర్‌ రిటెయినింగ్‌ వాల్‌ నిర్మించాల్సి ఉంది. దీనికి రూ.1.70 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. నిధులు రాగానే పనులు ప్రారంభిస్తాం.

నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29 టీఎంసీ లు. అయితే అది 17.8 టీఎంసీలకు పడిపోయింది. దీనికి కారణం పూడిక పేరుకుపోవడ మే.. లక్షల క్యూసెక్కుల నిల్వ సామర్థ్యం మేర ఇసుక, మట్టి నిండిపోయింది. నేషనల్‌ పాలసీ లో భాగంగా ప్రాజెక్టుల్లో నుంచి పూడిక తీయా లని గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదించాం. అ నుమతులు లభిస్తే టెండర్లు నిర్వహిస్తాం. పూ డిక తీస్తే ప్రాజెక్టుకు పూర్వ వైభవం సమకూరడంతో పాటు ముంపు సమస్య తీరుతుంది.

నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిండా నీళ్లుండి 40 వేల క్యూసెక్కుల దాకా ఇన్‌ఫ్లో ఉన్నా సమస్య రా వడం లేదు. 50 వేల క్యూసెక్కులకు పైగా నీరు వచ్చినపుడే ముంపు సమస్య ఏర్పడుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,405 అడు గులు(17.8 టీఎంసీలు) కాగా.. 1,400 అడుగులతో 16 టీఎంసీలు నిల్వ ఉంచినప్పటికీ వరద ఎక్కువగా రావడంతో నీరు వెనక్కి తన్నుతోంది. భారీగా వరదలు రావడం వల్లే ఇలా జరుగుతోంది.

● నిజాంసాగర్‌లో మంజీర కలిసే చోట పేరుకుపోయిన పూడిక ● నది1
1/3

● నిజాంసాగర్‌లో మంజీర కలిసే చోట పేరుకుపోయిన పూడిక ● నది

● నిజాంసాగర్‌లో మంజీర కలిసే చోట పేరుకుపోయిన పూడిక ● నది2
2/3

● నిజాంసాగర్‌లో మంజీర కలిసే చోట పేరుకుపోయిన పూడిక ● నది

● నిజాంసాగర్‌లో మంజీర కలిసే చోట పేరుకుపోయిన పూడిక ● నది3
3/3

● నిజాంసాగర్‌లో మంజీర కలిసే చోట పేరుకుపోయిన పూడిక ● నది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement