
విద్యా ప్రమాణాలు పెంచాలి
మున్సిపల్ సిబ్బందికి మెమోలు..
● జిల్లాను ఉన్నత స్థాయిలో నిలపాలి
● టీఎల్‌ఎం మేళాలో కలెక్టర్
ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంచాలని, విద్యారంగంలో జిల్లాను ఉన్నత స్థాయిలో నిలపాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఉపాధ్యాయులకు సూచించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని సరస్వతి విద్యా మందిర్ పాఠశాలలో నిర్వహించిన ఎఫ్‌ఎల్‌ఎన్ బోధన అభ్యసన సామగ్రి మేళా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మేళాను ప్రారంభించి మాట్లాడారు. ప్రాథమిక స్థాయి నుంచి బలమైన పునాది వేస్తేనే ఉన్నత విద్యలో రాణించగలుగుతారన్నారు. తరగతి గదిలో విద్యార్థులకు చదువుపై ఆసక్తి కలిగించేందుకు బోధన సామగ్రిని వినియోగించాలన్నారు. జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన 250 మంది ఉపాధ్యాయులు ప్రదర్శించిన బోధన అభ్యసన సామగ్రిని కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో డీఈవో రాజు, సమగ్ర శిక్ష సమన్వయకర్తలు వేణుగోపాల్, నాగవేందర్, రమణరావు తదితరులు పాల్గొన్నారు.
అనుమతి తప్పనిసరి..
సుప్రీం కోర్టు ఆదేశాలు, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం భవిష్యత్‌లో ఇసుక తవ్వకాల అనుమతులు ఇవ్వడానికి జిల్లా స్థాయి కమిటీ (డీఎస్‌ఆర్) నివేదిక తప్పనిసరని కలెక్టర్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రెవెన్యూ, గనులు, భూగర్భశాస్త్రం, భూగర్భ జలాలు, అటవీ, నీటిపారుదల, కాలుష్య నియంత్రణ మండలి, ప్రణాళిక విభాగాల అధికారులు డీఎస్‌ఆర్ కమిటీ సభ్యులుగా ఉంటారన్నారు. జిల్లాలోని గనుల కార్యకలాపాలు, లీజులు, ఆదాయం, ఇసుక ఉత్పత్తి, వర్షపాతం, భౌగోళిక పరిస్థితులు, అటవీ ప్రాంతాలు, నదులు, వాగులు, ఇసుక లభ్యతలాంటి వివరాలు డీఎస్‌ఆర్‌లో పొందుపరుస్తామన్నారు. మూడు రోజుల్లోగా జిల్లాకు సంబంధించి అందుబాటులో ఉన్న వనరుల లభ్యతపై సర్వే పూర్తి చేసి నెలాఖరులోగా ముసాయిదా నివేదికను సిద్ధం చేయాలన్నారు. అక్టోబర్ మొదటి వారంలో ముసాయిదాను ప్రజాభిప్రాయం కోసం జిల్లా వెబ్‌సైట్‌లో ఉంచుతామన్నారు. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని తుది నివేదికను నవంబర్ మొదటి వారంలో ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. జిల్లాలో పర్యావరణ అనుమతులను వేగవంతం చేయడానికి, ఇసుక, గనుల నియంత్రిత తవ్వకాలకు ఈ చర్యలు కీలకం కానున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పారిశుద్ధ్య కార్యక్రమాలలో నిర్లక్ష్యంగా వ్య వహరించిన మున్సిపల్ సిబ్బందికి మెమో లు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌ను కలెక్టర్ ఆదేశించారు. శుక్రవా రం ఆయన కామారెడ్డిలోని 15వ వార్డు వి నాయకనగర్‌లో పర్యటించారు. ఇటీవల కు రిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతు పనులను తనిఖీ చేశారు. దెబ్బతిన్న రోడ్లు, డ్రెయినేజీల పునరుద్ధరణ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.