
వీధి దీపం.. నిర్వహణ భారం..
● ఏడాదిన్నరగా అంధకారంలో పట్టణం
● పుర వీధులతోపాటు
ప్రధాన రోడ్లపైనా చీకట్లు
● నిధులు లేకపోవడమే కారణం
● ఇబ్బందులు పడుతున్న ప్రజలు
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపాలిటీలో వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. సూర్యు డు అస్తమించగానే పట్టణంలోని చాలా కాలనీలతోపాటు ప్రధాన రోడ్లపైనా అంధకారం నెలకొంటోంది. అక్కడక్కడ కొన్ని లైట్లు మాత్రమే వెలుగుతున్నా యి. బడ్జెట్ కొరతతో బల్దియాలకు వీధి దీపాల ని ర్వహణ భారంగా మారింది. నూతన బల్బులు కొ నుగోలు చేసే పరిస్థితులు లేకపోవడంతో చెడిపోయిన వాటి స్థానంలో నూతన బల్బులను బిగించ డం లేదు. చేతులెత్తేశారు. దీంతో ఏడాదిన్నరగా ప ట్టణంలోని దారులన్నీ చీకట్లలో ఉంటున్నాయి.
రూ. 8కోట్లకుపైగా బకాయిలు
బల్దియాలో వీధి దీపాలను అమర్చడం, నిర్వహణ ఈఈఎస్‌ఎల్ అనే సంస్థ ఆధ్వర్యంలో కొనసాగింది. ఐదేళ్లపాటు నిర్వహణ, పర్యవేక్షణ బాగానే సాగింది. ఏడాది కిత్రం కాంట్రాక్ట్ గడువు ముగిసింది. ఈ సంస్థకు రూ. 8 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. బడ్జెట్ లేకపోవడంతో అధికారులు సైతం నూతన బల్బులను కొనుగోలు చేయడం లేదు.
ఇదీ పరిస్థితి..
కామారెడ్డి బల్దియాలో 49 వార్డులో 300ల పరిధిలో 12,434 వీధి దీపాలున్నాయి. టేక్రియాల్ బైపాస్ నుంచి కొత్తబస్టాండ్ మీదుగా హౌసింగ్‌బోర్డు వరకు, నిజాంసాగర్ చౌరస్తా నుంచి దేవునిపల్లి వరకు, నిజాంసాగర్ చౌరస్తా నుంచి రైల్వేబ్రిడ్జి, స్టేషన్‌రోడ్ మీదుగా పాతబస్టాండ్, సిరిసిల్లరోడ్ బైపాస్ వరకు డివైడర్‌ల మధ్య సెంట్రల్ లైటింగ్ వ్యవస్థలో 450కిపైగా లైట్లు ఉన్నాయి. ప్రధానంగా సెంట్రల్ డివైడర్‌ల మధ్య 70 శాతం వరకు లైట్లు వెలగడం లేదు. కాలనీల్లోనూ చాలా వరకు లైట్లు పాడయ్యాయి. పలు కాలనీలలో మాజీ కౌన్సిలర్లు తమ సొంత డబ్బులతో వీధి దీపాలను అమర్చుతున్నారు.