
సీ్త్రనిధి రాష్ట్ర బోర్డు కోశాధికారికి సన్మానం
కామారెడ్డి టౌన్: సీ్త్రనిధి రాష్ట్ర బోర్డు కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికై న బీబీపేట మండల సమాఖ్య అధ్యక్షురాలు సదాల స్రవంతి శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెను అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు పుష్పరాణి, అడిషనల్ డీఆర్డీవో విజయలక్ష్మి, సీ్త్ర నిధి ఆర్‌ఎం కిరణ్ పాల్గొన్నారు.
దూరవిద్యలో ప్రవేశాల గడువు పొడిగింపు
కామారెడ్డి అర్బన్: ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల గడువును అక్టోబర్ 15 వరకు పొడిగించారు. ఆసక్తిగలవారు కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని స్టడీ సెంటర్‌లోగాని, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 94403 56276, 91823 04067 నంబర్లలోగాని సంప్రదించాలని సెంటర్ కోఆర్డినేటర్ ఓ ప్రకటనలో సూచించారు.
డ్రంకన్ డ్రైవ్‌లో
11 మందికి జైలు
కామారెడ్డి క్రైం : మద్యం సేవించి వాహనా లు నడిపినందుకుగాను జిల్లాలో శుక్రవారం ఒకేరోజు 33 మందికి శిక్షలు పడ్డాయని ఎస్పీ రాజేశ్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిని కోర్టులలో ప్రవేశపెట్టామని.. ఇందులో 11 మంది కి ఒకరోజు జైలు శిక్ష, రూ. వెయ్యి చొప్పున జరిమానా, మరో 22 మందికి రూ.వెయ్యి చొప్పున జరిమానాలు విధించారని పేర్కొన్నారు. కామారెడ్డి పీఎస్ పరిధిలో ముగ్గు రికి, ఎల్లారెడ్డి పీఎస్ పరిధిలో ఆరుగురికి, గాంధారి పీఎస్ పరిధిలో ఇద్దరికి జైలు శిక్ష పడిందని తెలిపారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంకన్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహిస్తు న్నామని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనం నడిపే వారిపై చట్టప్రకారం చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని కోరారు.
దోమకొండలో
ఇద్దరికి డెంగీ
దోమకొండ: మండల కేంద్రానికి చెందిన ఇ ద్దరు మహిళలకు డెంగీ సోకింది. శుక్రవారం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంత రం వారిని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి త రలించారు. ప్లేట్‌లెట్స్ తగ్గిపోవడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు, మరొకరిని నిజామాబాద్ ఆస్పత్రికి పంపించారు. బాధితులు ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు. కాగా గ్రామంలో పారిశుద్ధ్య లోపంతో వారం పది రోజులుగా ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. పారిశుద్ధ్య సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.