
మాల్తుమ్మెద విత్తన క్షేత్రంలో ధాన్యం వేలం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మాల్తుమ్మెద విత్తనోత్పత్తి క్షేత్రంలో విత్తన తయారీకి ఉపయోగపడని 429 క్వింటాళ్ల ధాన్యానికి శుక్రవారం సంబంధిత అధికారులు వేలం పాట నిర్వహించారు. విత్తన క్షేత్రంలో నిర్వహించిన వేలం పాటలో ఏడుగురు పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామానికి చెందిన స్కైలాబ్ గౌడ్ అనే వ్యక్తి క్వింటాల్‌కు రూ.1,590 చొప్పున పాడి ధాన్యాన్ని దక్కించుకున్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి, తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ ఆర్‌ఎం రఘు, విత్తనక్షేత్ర ఏడీఏ ఇంద్రసేన్, ఏవో అచరిత, ఎల్లారెడ్డి ఏఎంసీ కార్యదర్శి శ్రీనివాస్, ఏఈవో శ్యాంసుందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.