
‘కృత్రిమ మేధ ఒక శక్తిమంతమైన సాధనం’
కామారెడ్డి అర్బన్: కామర్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్ విద్యార్థులకు కృత్రిమ మేధ ఒక శక్తిమంతమైన సాధనమని రిసోర్స్ పర్సన్ డాక్టర్ మల్లికార్జునరావు అన్నారు. కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కామర్స్ విభాగం ఆధ్వర్యంలో గురువారం ‘అప్ స్కిల్లింగ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ స్టూడెంట్స్ ఫర్ టుమారో కెరీర్స్’ అంశంపై ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించారు. ప్రిన్సిపల్ కె.విజయ్‌కుమార్, వైస్ ప్రిన్సిపల్ కె.కిష్టయ్య, కామర్స్ హెచ్‌వోడీ అంకం జయప్రకాష్, వర్క్‌షాప్ కన్వీనర్ కవిత, సమన్వయకర్త విశ్వప్రసాద్, జి.శ్రీనివాస్‌రావు, విజయ్‌కుమార్, మీరాబాయి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.