
వరద బాధిత విద్యార్థులకు ఏబీవీపీ అండ
రాజంపేట: ఏబీవీపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి వరద బాధిత ప్రాంతాలైన గుండారం, సరంపల్లి, కొండాపూర్, నాగిరెడ్డిపేట్ గ్రామాల్లో, తండాల్లోని చదివే విద్యార్థులకు గిఫ్ట్ ఏ నోట్ బుక్ కార్యక్రమం పేరుమీద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేఽశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు బి.శివ పాల్గొని పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఎక్కడ సమస్య వస్తే అక్కడ ఏబీవీపీ ఉంటుందని అన్నారు. ఇందూరు విభాగ్ సంఘటన కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. కార్యక్రమాన్ని సద్వి నియోగం చేసుకోవాలని, బాగా చదివి దేశానికి సేవ చేయాలని అన్నారు. నేతలు రంజిత్ మోహన్, గిరి, స్వామిరెడ్డి, అనిల్ రెడ్డి, మోహన్, తదితరులు పాల్గొన్నారు.