
జీపీవోలు విధులను సక్రమంగా నిర్వహించాలి
ఆర్డీవో పార్థసింహారెడ్డి
ఎల్లారెడ్డి: గ్రామ పరిపాలన అధికారులు(జీపీవో) వారి విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఆర్డీవో పార్థసింహారెడ్డి సూచించారు. గురువారం మీసాన్‌పల్లి రైతు వేదికలో ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, గాంధారి, లింగంపేట మండలాల జీపీవోలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. జీపీవోలు వారికి కేటాయించిన గ్రామాలలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురి కాకుండా చూడాలని, కుల, ఆదాయ, రేషన్‌కార్డులు, కల్యాణలక్ష్మి పథకాలకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి గ్రామంలో విచారించిన అనంతరం ధృవీకరించాలని అన్నారు.