బాలాజీ జెండాకు భక్తుల వీడ్కోలు | - | Sakshi
Sakshi News home page

బాలాజీ జెండాకు భక్తుల వీడ్కోలు

Sep 19 2025 2:07 AM | Updated on Sep 19 2025 2:07 AM

బాలాజ

బాలాజీ జెండాకు భక్తుల వీడ్కోలు

బాలాజీ జెండాకు భక్తుల వీడ్కోలు జిల్లా స్థాయి వాలీబాల్‌ టోర్నీ వాల్‌పోస్టర్ల ఆవిష్కరణ

వైభవంగా బాలాజీ జెండా ఊరేగింపు

మద్నూర్‌(జుక్కల్‌): మండల కేంద్రంలో 11 రోజులుగా పూజలందుకున్న తిరుమల తిరుపతి శ్రీవారి బాలాజీ జెండాకు గురువారం భక్తులు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఊరేగింపు కార్యక్రమాన్ని భక్తులు వైభవంగా నిర్వహించారు. భక్తులు జెండాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం బాలాజీ జెండా 11 రోజుల పాటు మద్నూర్‌లో పూజలందుకున్న అనంతరం తిరుమలకు తరలివెళ్తుందన్నారు. జెండా వెంట భక్తులు గ్రామ పొలిమేర వరకు భజనలు చేస్తూ వెళ్లారు.

బాన్సువాడ: బోర్లం క్యాంపులో నిర్వహించే జిల్లా స్థాయి వాలీబాల్‌ టోర్నమెంట్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్లను గురువారం డీఎస్పీ విఠల్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో వాలీబాల్‌ టోర్నీ కొనసాగుతుందని, జిల్లాలోని వివిధ మండలాల క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు ధరావత్‌ రవి తెలిపారు. మొదటి బహుమతి రూ.20 వేలు, ద్వితీయ బహుమతి రూ.10 వేల నగదుతో పాటు మెమోంటోలు అందజేస్తామని వారు తెలిపారు.

డీజేలకు అనుమతి లేదు

ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు

ఎల్లారెడ్డి: దేవి నవరాత్రి ఉత్సవాలకు డీజేలకు అనుమతి లేదని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు అన్నారు. గురువారం ఎల్లారెడ్డి పోలీస్‌ స్టేషన్‌లో ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి మండలాల దేవి మండప నిర్వాహకులతో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. దుర్గామాత నవరాత్రులు ప్రారంభమవుతున్న దృష్ట్యా పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని నిర్వాహకులకు సూచించారు. మండపాల ఏర్పాటుకు సంబందించిన వివరాలను పోలీసులకు అందించాలని సూచించారు. సీఐ రాజారెడ్డి, ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి మండలాల ఎస్సైలు దీపక్‌ కుమార్‌, ఆంజనేయులు, భార్గవ్‌గౌడ్‌, సుబ్రహ్మణ్యచారి, దేవి మండప నిర్వాహకులు, శాంతి కమిటీ సభ్యులు సాయిబాబా, రాములు తదితరులున్నారు.

బాలాజీ జెండాకు  భక్తుల వీడ్కోలు 1
1/2

బాలాజీ జెండాకు భక్తుల వీడ్కోలు

బాలాజీ జెండాకు  భక్తుల వీడ్కోలు 2
2/2

బాలాజీ జెండాకు భక్తుల వీడ్కోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement