
మహిళలు పౌష్టికాహారం తీసుకోవాలి
సాక్షి నెట్‌వర్క్:జిల్లాలోని పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో నేటి నుంచి నెల రోజుల పాటు పోషణ మాసం కార్యక్రమం చేపడుతున్నట్లు గురువారం ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. గర్భిణుల బరువు, ఎత్తు వివరాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. మహిళలు ఆరోగ్యంగా ఉంటాలంటే ప్రతి రోజు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. గర్భిణులు పౌష్టికాహారం తీసుకుంటే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. బాలింతలు సైతం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం తీసుకొని తమ పిల్లలకు పెట్టాలని సూచించారు. ఆహారంలో చక్కెర, నూనెను తక్కువగా ఉపయోగించాలని అన్నారు. అవి ఎక్కువగా వాడితే జరిగే నష్టాల గురించి తెలియజేశారు.

మహిళలు పౌష్టికాహారం తీసుకోవాలి

మహిళలు పౌష్టికాహారం తీసుకోవాలి